Home » Odisha train accident
ఒడిశాలోని బాలాసార్‌లో మూడు రైళ్లు ఢీకొని 275 మంది మృత్యువాత పడటం, మరో 700 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారత ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ప్రకటించారు. వారి చదువులు తాము చూసుకుంటామని ఒక ట్వీట్‌లో తెలిపారు.
ఒడిసా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్యతో కూడిన చిట్టాను బయటకు తెచ్చింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని 288 మంది మృతిచెందిన నేపథ్యంలో కోల్‌కతా వెళ్లే ప్రయాణికుల కోసం ఉచిత బస్సు సర్వీసులను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రైలు సర్వీసులు పునరుద్ధరించేంత వరకూ ఈ సదుపాయం అమలులో ఉంటుంది.
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనపై సుప్రీంకోర్టులో అదివారంనాడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సారథ్యంలో నిపుణుల కమిటీతో విచారణ జరపించాలని కోరుతూ ఈ పిల్ దాఖలైంది.
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఏకంగా 288 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 1100 మంది గాయాలపాలవ్వడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘోరప్రమాదంలో బాధితుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (Life insurance Corporation on India) కీలక ప్రకటన చేసింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఒడిశా కోరమండల్ రైల్ ప్రమాదం ఎఫెక్ట్ తగిలింది. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా రైల్వే అధికారులు 19 రైళ్లను రద్దు చేసి, 26 రైళ్లను దారి మళ్లించారు.
ఒడిశాలో అత్యంత భయానక రైలు ప్రమాదం సంభవించిన నేపథ్యంలో రైలు ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం, రైల్వే శాఖ అమలు చేస్తున్న భద్రతా చర్యలపై చర్చ మళ్లీ ప్రారంభమైంది.
భారత చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా రైలు దుర్ఘటనకు (Odisha train tragedy) మూలకారణాన్ని గుర్తించామని కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం మరోసారి ఆయన సందర్శించారు.
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రగాఢ సంతాపం తెలిపారు