Home » Ongole
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని.. అన్నీ దోచేశారంటూ విరుచుకుపడ్డారు.
పాపం ఆ దొంగలకు.. దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచాలో అర్థం కాలేదనుకుంటా. అందుకే మర్రి చెట్టు తొర్రలో దాటి పెట్టారు. అది కూడా ఒకటి.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 66 లక్షలు. అయితే దొంగతనం జరిగిందన్న తర్వాత.. పోలీసులు ఉరుకుంటారా? ఆ దొంగలను పట్టుకొన్నారు.
వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06507 బెంగళూరు - ఖరగ్‌పూర్(Bangalore - Kharagpur) ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.45 గంటలకు ఖరగ్‌పూర్ చేరుకుంటుంది.
వైసీపీ(YSRCP) బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. ఒంగోలులో వరుస ఘటనలే అందుకు నిదర్శనం. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే(Police Station) ఎమ్మెల్యే, ఆయన తనయుడు, వారి అనుచరులు హల్చల్ చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు(Ongole) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivas Reddy), ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి తన అనుచరులతో..
ఒంగోలులో వైసీపీ (YSRCP) రౌడీ రాజకీయం శ్రుతిమించింది. బుధవారం నగరంలో టీడీపీ నాయకులతోపాటు, సామాన్యులపైనా దాడి చేసి, బీభత్సం చేసిన ఆ పార్టీ నేతలు.. తిరిగి తెలుగుదేశం వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. దీనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ వారు ఫిర్యాదిచ్చిందే తడవుగా కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.
AP Elections: ఒంగోలులో వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వలంటీర్ ఉండటాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌రావుపైనా, మరికొందరిపైనా దాడి చేశారు. రక్తపుమడుగులో కిందపడిపోయిన మోహన్‌రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించడంతో మూడుగంటలపాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...
Andhrapradesh: టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతాను. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.
Andhrapradesh: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు.