Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:41 AM
Prabhavati Investigation: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ నిమిత్తం ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కాసేపటికే ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.

ప్రకాశం, ఏప్రిల్ 7: గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి (Doctor Prabhavati) పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈరోజు (సోమవారం) ఉదయం విచారణ నిమిత్తం ప్రభావతి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే మధ్యాహ్నం 1:30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఎస్పీ దామోదర్ (Ongole SP Damodar) చెప్పారు. దీంతో ఎస్పీ కార్యాలయం నుంచి ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుపై (AP Deputy Speaker Raghurama Krishnam Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి ఐదవ నిందితురాలిగా ఉన్నారు. ఈకేసులో రెండు రోజుల పాటు ప్రభావతిని విచారించేందుకు ఎస్పీ దామోదర్ ముందస్తుగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ప్రభావతి ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణకు వచ్చారు. కానీ ఎస్పీ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమంతో పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో ఎస్పీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1:30 గంటకు హాజరుకావాలని ప్రభావతికి పోలీసులు తెలిపారు. దీంతో వెళ్లిపోయిన ప్రభావతి తిరిగి 1:30 గంటలకు విచారణకు రానున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగినప్పటికీ మెడికల్ రిపోర్డులు మార్చి కోర్టుకు నివేదించారంటూ ప్రభావతిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఫిబ్రవరి 7న మొదటి సారి ప్రభావతి విచారణకు హాజరైనప్పటికీ దాటవేత ధోరణలోనే సమాధానం ఇచ్చారు. ఎస్పీ దామోదర్ అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి ప్రభావతిని విచారించేందుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నేడు, రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయమే ప్రభావతి విచారణకు వచ్చారు. అయితే ఎస్పీ బిజీ షెడ్యూల్ ఉండటంతో మధ్యాహ్నం 1:30 గంటలకు విచారణకు హాజరు అవ్వాలని చెప్పడంతో ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్
కాగా.. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రభావతి. దీనిపై ఇటీవల సుప్రీంలో విచారణకు రాగా.. ప్రభావతి విచారణకు హాజరుకావాల్సిందే అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 7, 8 తేదీల్లో ప్రభావతి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని... దర్యాప్తునకు పూర్తి సహకించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభావతి విచారణకు హాజరు కావలసిందేనని.. సహకరిస్తామని చెబితేనే ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
P Chidambaram: తమిళనాడుకు భారీగా పెరిగిన నిధులు.. చిదంబరం విమర్శలు
Medchal Crime News: రైల్వేస్టేషన్ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు
Read Latest AP News And Telugu News