Share News

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:36 PM

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్
DIG Sunil Kumar Nayak

ప్రకాశం జిల్లా: నరసాపురం మాజీ ఎంపీ (Ex MP), ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి (AP Deputy Speaker) రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju) కస్టోడియల్‌ టార్చర్‌ కేసు (Custodial torture case)లో అప్పటి సీఐడీ డీఐజీ (CID DIG)గా పనిచేసిన సునీల్‌ నాయక్‌ (Sunil Naik) ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరు కాకపోవడంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సునీల్ కుమార్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ అక్కడే ఉన్నారని గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీలో డీఐజీగా సునీల్ కుమార్ నాయక్ పని చేశారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లో ఫైర్ సర్వీసెస్ డీఐజీగా ఉన్నారు.

Read More..:

ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్


సునీల్ కుమార్ నాయక్ ఎవరంటే..

రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బిహార్‌ క్యాడర్‌కు చెందిన సునీల్‌ నాయక్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి, సీఐడీ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్‌ టార్చర్‌ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు, అప్పటి సీఎం జగన్‌పై రఘురామ గుంటూరు నగరంపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం విధితమే.


ఈ కేసులో నిందితులు వారే..

గుంటూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో... గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ ఛీఫ్‌గా వ్యవహరించిన పీవీ సునీల్‌ కుమార్, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్‌ విశ్రాంత పర్యవేక్షణాధికారి డాక్టర్‌ నీలం ప్రభావతి నిందితులుగా ఉన్నారు. సునీల్‌కుమార్‌కు సన్నిహితుడు.. లీగల్‌ అసిస్టెంట్‌గా వ్యవహరించిన కామేపల్లి తులసిబాబును కూడా పోలీసులు విచారించి.. అరెస్టు చేశారు. ప్రస్తుతం విజయ్‌పాల్‌ కండిషన్‌ బెయిల్‌పై ఉండగా... డాక్టర్‌ ప్రభావతికి అరెస్టు నుంచి న్యాయస్థానం ఊరట కల్పించింది. ఆమెను సయితం పోలీసులు విచారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..

మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై రఘురామ స్పందన..

జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 03 , 2025 | 12:36 PM