Share News

YSRCP Scams: వైసీపీ హయాంలో మరో స్కాం.. దూకుడు పెంచిన కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Feb 22 , 2025 | 09:52 PM

YSRCP Scams: వైసీపీ హయాంలో భారీ కుంభకోణం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

 YSRCP Scams:  వైసీపీ హయాంలో మరో స్కాం.. దూకుడు పెంచిన కూటమి ప్రభుత్వం
YSRCP Scams

ప్రకాశం: వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒంగోలు, పరిసర ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో రెండేళ్ల క్రితం వెలుగుచూసిన భూ అక్రమాలపై జిల్లా అధికారులతో రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా ఇవాళ(శనివారం) సమీక్ష నిర్వహించారు. జగన్ ప్రభుత్వ హయాంలో బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు సిట్ విచారణ బృందాన్ని గత వైసీపీ ప్రభుత్వం నియమించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసింది.


RP-Sisodia.jpg

ఫేక్ డాక్యుమెంట్స్‌పై విచారణ..

సిట్ బృందం ఏర్పడ్డ అనంతరం విచారణ పురోగతిపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్, ఆర్.గోపాలకృష్ణలతో ఆర్పీ సిసోడియా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్రమాలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాటి దర్యాప్తు పురోగతి, ఛార్జ్‌షీట్ దాఖలు, తదితర అంశాలపై జిల్లా అధికారుల నుంచి ఆర్పీ సిసోడియా వివరాలు సేకరించారు. బాధితుల కేసులకు సంబంధించిన స్థలాలు, వ్యవసాయ భూములపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇతర పత్రాలను పరిశీలించి వాటికి సంబంధించిన వాస్తవ యజమానులు, డాక్యుమెంట్లను గుర్తించాలని అధికారులకు ఆర్పీ సిసోడియా సూచించారు. స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారో ఆధారాలను సేకరించాలని ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. రివ్యూలో రెవెన్యూ, పొలీసు, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిట్ పరిధిలోకి రాని కేసులను తొలగించాలని, మిగతా కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఆర్పీ సిసోడియా దిశా నిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 09:57 PM