Home » Paper Leakage
నీట్‌ను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు.
నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్ చేసింది.
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
గ్రేస్ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.
నీట్’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్’ పోస్టులో వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
నీట్ యూజీ పేపర్ లీక్(NEET Paper Leakage) వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మెడికల్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు(Protesters) జంతర్ మంతర్ నుండి లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు ర్యాలీ తీశారు.
రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల లీక్ ...
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎ్‌సటీఎఫ్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్ ముఖియాకు అత్రి సన్నిహితుడు.