NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజ్‌లో సంచలన విషయాలు.. పకడ్బందీగా పేపర్ ట్యాంపరింగ్
ABN , Publish Date - Jun 24 , 2024 | 05:32 PM
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాంచీ: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పెను దుమారం రేపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లీకేజ్ కారకులను పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో నిందితుల నుంచి పేపర్ లీకేజీ ఎలా జరిగిందో రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో పోలీసులు సోమవారం దర్యాప్తు చేశారు. ఈఓడబ్ల్యూ(Economic Offences Wing) బృందం హజారీబాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాఠశాలలో ప్రశ్నపత్రం షీల్డ్ కవర్ దిగువ భాగంలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఈఓడబ్ల్యూ బృందం గుర్తించింది.
దొరికిన ఆధారాలివే..
ప్రశ్నపత్రం ప్యాక్‌లోని దిగువ భాగాన్ని చాలా జాగ్రత్తగా తారుమారు చేసి, అతికించినట్లు ఈఓయూ బృందం విచారణలో కనుగొంది. ఈ అంశంపై ప్రిన్సిపల్ ఎహసాన్ ఉల్ హక్ మాట్లాడుతూ.. పరీక్షకు 15 నిమిషాల ముందు ప్యాకెట్ తెరిచామని.. నిపుణుడే పేపర్ ట్యాంపరింగ్ చేసి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.
రవాణాలో లోపాలు..
ఈఓయూ బృందంతో కలిసి బ్యాంకు, కొరియర్ కంపెనీకి వెళ్లిన ప్రిన్సిపల్ ఎహసాన్ ప్రశ్నాపత్రాలను చేరవేసే పద్ధతిలో లోపాలున్నాయని చెప్పాడు. ఎస్బీఐలో నిర్వహించిన తనిఖీల్లో ఈఓయూ ఈ లోపాల్ని కనిపెట్టింది.
పని చేయడని డిజిటల్ లాక్..
ఒయాసిస్ ప్రిన్సిపల్ ఎహసాన్ మరో విషయాన్ని వెల్లడించారు. ప్రశ్నాపత్రాలున్న పెట్టె డిజిటల్ లాక్ పరీక్ష రోజు పనిచేయలేదని తెలిపాడు. నిజానికి అందులో రెండు తాళాలు ఉన్నాయి. 1 నిమిషం 15 సెకన్ల తరువాత బీప్ సౌండ్ వినిపించగానే బాక్స్ ఓపెన్ అవుతుంది. కానీ ఆ రోజు అలాంటి శబ్దం వినిపించలేదని ప్రిన్సిపల్ వెల్లడించాడు.
అయితే సాంకేతిక సమస్య వల్ల సౌండ్ రాలేదని ఎన్టీఏ తెలిపింది. తర్వాత పెట్టెను కట్టర్‌తో కోయమని ప్రిన్సిపల్ సూచించగా.. సిబ్బంది అలాగే చేశారు. దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్న వేళ ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఓ బృందం బిహార్ రాజధాని పట్నాకు చేరుకోగా, మరో బృందం గుజరాత్‌లోని గోద్రాకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
For Latest News and National News click here