Home » Parliament
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించారు. బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తున్నట్టు లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ మంగళవారంనాడు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) పలు కసరత్తులు చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్తో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచే విధంగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
పోటీ పరీక్షల విషయంలో ఇప్పటివరకూ ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్షలు రాయించడమో, ముందుగానే పేపర్లు లీక్ చేయడమో వంటిని చాలా జరిగాయి. ఇలాంటి వ్యవహారాల వెనుక కేవలం ఒకరిద్దరి హస్తం మాత్రమే ఉండదు.. పెద్ద మాఫియా గ్యాంగే ఉంటుంది.
వంద రోజుల్లో మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
PM Narendra Modi: విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
'పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ' అనే అంశంపై పార్లమెంటులో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల 'వివక్ష' చూపుతున్నారంటూ అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇందులో వాస్తవం లేదని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) కాంగ్రెస్(Congress) టికెట్ల దరఖాస్తుల కోసం ఆశావాహులు బారీగా పోటీ పడ్డారు. అయితే ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు గతంలో ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా పలువురు ఎంపీలు ప్రవర్తించారని.. వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ(BJP) ఫోకస్ పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. పది ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా కమలం ప్రణాళికలు రచిస్తోంది.
బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతల సమావేశం శుక్రవారం నాడు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్లో నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఫాం హౌస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోతున్నారు.