Share News

Delhi: నిన్న పైనుంచి లీక్.. నేడు ఏకంగా వరదే.. కొత్త పార్లమెంట్‌ భవనంలో పరిస్థితి ఇదీ!

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:37 PM

National: ఢిల్లీలో గత కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో పార్లమెంటు నూతన భవనం కూడా చిక్కుకుపోయింది. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వరద నీటిలో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికి భవనంలోపలికి వర్షపు నీరు వచ్చి చేరి ఇబ్బందికరంగా మారిపోయింది.

Delhi: నిన్న పైనుంచి లీక్.. నేడు ఏకంగా వరదే.. కొత్త పార్లమెంట్‌ భవనంలో పరిస్థితి ఇదీ!
New Parliament Building

న్యూఢిల్లీ, ఆగస్టు 2: పార్లమెంటు భవనం..! ప్రధానితో సహా కేంద్రమంత్రులు, ఎంపీలు కొలువై ఉండే సభ..! అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం (New Parliament Building)..! ప్రజాసమస్యలపై చర్చలు జరిపే ఆ సభ కాస్తా.. ఇప్పుడు మరోరకంగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొత్త పార్లమెంట్ భవనం గురించే జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

TG Politics: మమల్ని వేధిస్తున్నారు.. సభలో కేటీఆర్..!


వరద నీటిలో....

ఢిల్లీలో (Delhi) గత కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో పార్లమెంటు నూతన భవనం కూడా చిక్కుకుపోయింది. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వరద నీటిలో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికి భవనంలోపలికి వర్షపు నీరు వచ్చి చేరి ఇబ్బందికరంగా మారిపోయింది. నిన్న కాస్తలో కాస్త భవనం పై కప్పు నుంచి నీరు రాగా.. ఈరోజు ఏకంగా పార్లమెంటులోకి వరద నీరు వచ్చి చేరింది. పార్లమెంట్ నూతన భవనంలో వర్షం నీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దాదాపు రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Supreme Court: ఎన్టీఏ లోపాల వల్లే లీకేజీ..!!


విపక్ష నేతల ఎద్దేవా...

మరోవైపు నిన్న కూడా ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భవనం లాబీలోని గాజు పైకప్పు నుంచి కింద ఉచిన బకెట్‌లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘‘కొత్త భవనం కంటే పాత భవనం చాలా మెరుగ్గా ఉంది. వర్షాకాల సమావేశాలను పాతదానిలో ఎందుకు నిర్వహించకూడదు. కనీసం కొత్తదానిలో నీరు కారడం ఆగిపోయే వరకైనా..’ అంటూ అఖిలేష్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ వీడియోపై కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ స్పందించారు. ‘‘బయట పేపర్‌ లీక్‌.. లోపల వాటర్‌ లీక్‌.. నిర్మించిన ఏడాది పూర్తి కాకుండానే పార్లమెంట్‌ లాబీలో నీరు లీక్‌ కావడం కొత్త భవనంలో అత్యవసర పునరుద్ధరణ సమస్యలను ఎత్తి చూపుతోంది’’ అని ఎద్దేవా చేశారు. అయితే పైకప్పు గ్లాస్‌ డోమ్‌లకు ఏర్పాటుచేసిన పట్టీలు వదులుగా ఉండటంతో కొత్త పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద స్పల్పంగా నీరు లీకైందని లోక్‌సభ సెక్రటేరియట్‌ తెలిపింది. సకాలంలో సమస్యను గుర్తించి, వెంటనే మరమ్మతులు చేపట్టామని, అంతటితో నీరు కారడం ఆగిపోయిందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


కాగా... సెంట్రల్ విస్టా రీ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్మించారు. రూ. 862 కోట్లు ఖర్చుతో 64,500 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. గతేడాది మే 23వ తేదీన ప్రధాని మోదీ ఈ సెంట్రల్ విస్టా భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ

Viral: ఇల్లు అద్దెకిస్తామంటూ మహిళ యాడ్..ఆమె పెట్టిన కండీషన్ చూసి..

Read Latest National News And Telugu News

Updated Date - Aug 02 , 2024 | 03:43 PM