Home » Pattabhi ram
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్‌లో హెరిటెజ్‌కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్‌కు కొందరు అధికారులు ఊడిగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్( Kommareddy Pattabhiram) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని మండిపడ్డారు.
Andhrapradesh: విజయవాడలో కరకట్ట ఆనుకుని నిర్మించిన రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలను తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సమాచార చట్టం ద్వారా ఇచ్చిన జవాబు ఆధారాలు టీడీపీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు, మొదటిదశ నిర్మాణం పూర్తి, ఖర్చు చేసిన రూ.164.42కోట్ల వివరాలపై వీడియోను విడుదల చేసింది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేందుకు పది రోజులు పడుతుందంటూ సర్కార్ చెప్పడంపై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే జగన్మోహన రెడ్డి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సోమవారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కన్నా ముందే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలనే ఆదేశాలు వచ్చాయని గుర్తుచేశారు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్లు ఎక్కడా డోర్ టూ డోర్ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని చెప్పలేదన్నారు.
సీఎం జగన్(CM Jagan) సింగిల్ కాదని.. ఆయన వెంట మాఫియా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి(Pattabhi) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ నేతలపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ సీతారామాంజనేయులు నిఘా పెట్టే బదులు.. విశాఖలో డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశంపై ఆయన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్టణం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏంపని అని ప్రశ్నించారు. జగన్ మోచేతినీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందన్నారు. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లల్లో లక్షాలాది కోట్లు దోచుకున్న జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డిపట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం (Jagan Govt) రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్‌ను ఇవ్వలేదా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram) ప్రశ్నించారు. తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును జగన్ ఈ సంస్థకు దారాదత్తం చేయలేదా అని నిలదీశారు.