Share News

Kommareddy: నాపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:02 PM

AP Politics: ప్రజలు మక్కెలు విరగొట్టి మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ అరాచకాలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) అన్నారు. ఏపీ అసెంబ్లీలో 11స్థానాలకే ప్రజలు పరిమితం చేసినా వారిలో మార్పు మాత్రం రాలేదన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్‌ను వైసీపీ సైకో మూకలు దారుణంగా హతమార్చారంటూ ఆయన ఆరోపించారు.

Kommareddy: నాపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
Kommareddy Pattabhi Ram

AP Politics: ప్రజలు మక్కెలు విరగొట్టి మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ అరాచకాలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) అన్నారు. ఏపీ అసెంబ్లీలో 11స్థానాలకే ప్రజలు పరిమితం చేసినా వారిలో మార్పు మాత్రం రాలేదన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్‌ను వైసీపీ సైకో మూకలు దారుణంగా హతమార్చారంటూ ఆయన ఆరోపించారు. ఐదేళ్లలో వారి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. తమ కార్యాకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారని, లోకేశ్ పాదయాత్రపై 22సార్లు దాడులు చేశారని మండిపడ్డారు.


కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. "ఐదేళ్ల పాలనలో వైసీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?, చెన్నుపాటి గాంధీపై దాడిచేసి కన్ను పోగొట్టారు. యర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబు పర్యటనలపై దాడులు చేశారు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై అనేక సార్లు దాడి చేసినప్పుడు, నాపై దాడిచేసి నా బిడ్డను భయపెట్టినప్పుడు వైసీపీ సైకోలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం. కూటమి పార్టీలూ దాని పరిరక్షణకు కట్టుబడి ఉన్నాయి. తెలుగుదేశం ఎప్పుడూ హింసను ప్రేరేపించదు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలు మాకు ఎప్పుడూ గుర్తు చేస్తారు . రాష్ట్రంలో ఎక్కడా భౌతికదాడులు జరగవు. వైసీపీ నేతలు భయపడాల్సిన పనిలేదు. ఐసీపీ సెక్షన్ల పవరేంటో చూపిస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. లోకేశ్ రెడ్ బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తాం. వైసీపీ మూకలు జైలుకు వెళ్లడానికి సిద్ధం కావాలి" అని పట్టాభిరామ్ అన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 03:07 PM