Share News

AP Politics: ఆ ఎస్పీకి పట్టాభి మాస్ వార్నింగ్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:36 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ - 8 సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది.

AP Politics: ఆ ఎస్పీకి పట్టాభి మాస్ వార్నింగ్‌
Kommareddy Pattabhi Ram

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ - 8 సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) కేవలం11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఫలితాలతో వైసీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, కీలక నేతలపై అక్రమ కేసులు పెట్టించిన వైసీపీ ముఖ్య నేతలు కొంతమంది విదేశాలకు వెళ్తున్నారని సమాచారం. వారికి సహకరించిన అధికారులు కూడా ఒక్కొక్కరిగా రాజీనామాల బాట పడుతున్నారు. మరి కొంతమంది అధికారులు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.


అధికారుల్లో భయం..!

ఈ క్రమంలోనే 2023లో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుచేసిన అధికారులను వదలిపెట్టబోమని హెచ్చరించిన విషయం తెలిసిందే. వైసీపీకి వత్తాసు పలికిన అధికారుల లిస్ట్‌ను తాను రెడ్‌బుక్‌లో ఎక్కించుకున్నట్లు కూడా వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులు అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌‌పై (Kommareddy Pattabhi Ram) కూడా అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పలుమార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈరోజు(బుధవారం) జాషువాని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పట్టాభి రామ్ మీడియాతో మాట్లాడారు.


జాషువాను సత్కరిద్దమని వచ్చా...

‘‘నన్ను అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చా. 2023 ఫిబ్రవరి 20 వ తేదీన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒక అక్రమకేసులో నన్ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అర్ధరాత్రి కరెంటు తీసేసి జాషువా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయనను కలిసి బొకే ఇచ్చేందుకు అతని నివాసానికి వచ్చా. విజయవాడ సమీపంలో తన ఏడున్నర ఎకరాల్లో ఉన్న విలాసవంతమైన అతిథి గృహంలో ఉన్నారని తెలుసుకుని వచ్చా. పుషగుచ్చం, శాలువాతో సత్కారం చేద్దామని వచ్చాను. అయితే అతను ఇక్కడ లేరని, నిన్న ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ఆయన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోయారని వాచ్‌మెన్ చెప్పారు. అతిథి గృహంలోనే ఒక కుర్చీలో పుష్పగుచ్ఛం, శాలువాను ఉంచి వీడియో ద్వారా తన సందేశాన్ని ఎస్పీ సెల్ ఫోన్‌కు పంపించా’’ అని పట్టాభి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యే దుమారం రేపే వ్యాఖ్యలు.. ఆ ఒక్కడే..!!

AP Elections Results: బాబు గెలుపు.. సహకరించిన జగన్ మనిషి..?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 06:05 PM