Home » Pawan Kalyan
సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.
2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..
జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్ డేగా ఇవాళ జరుపుకుంటున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. దేశ అభివృద్ధికి సూచికలైన ఇంజినీర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..
70 ఏళ్లు పైబడిన వారందకీ రూ.5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ ఆమోదించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...
రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 21 వేల క్యూసెక్కులు దాటిపోయింది. దీంతో దిగువకు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.