Home » Pawan Kalyan
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్‌పై సొంత క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమనే చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు తక్కువుగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడ కనిపిస్తారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన సొంత నియోజకవర్గం పిఠాపురం(Pithapuram) అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్థుల భవనం కొనుగోలు చేసిన పవన్.. దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు.
కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడవ రోజు పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఉప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాన్వాయ్ ఒకచోట అకస్మాత్తుగా ఆగింది.
కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. ఉదయం 10.45 కు ఉప్పాడ సముద్రపు కోతను పవన్ పరిశీలించనున్నారు. అనంతరం హార్బర సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరప మండలం గురజనాపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యలఫ్యాక్టరీ ఆక్వా కాలుష్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న పవన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. యువతి మిస్సింగ్ వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా సీఐకి ఫోన్ చేసి మాట్లాడిన ఈ కేసులో కీలక పురోగతి లభించించింది.