YSRCP vs JANASENA: పవన్‌తో పెట్టుకుంటే అంతే.. దెబ్బ గట్టిగా తగిలిందా
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:23 AM
అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పపట్టిన పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటూ జగన్ గత చరిత్రను అసెంబ్లీ వేదికగా ప్రజలకు మరోసారి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జగన్‌ను క్లీన్ బౌల్డ్ చేశారా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల మొదటిరోజైన సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సృష్టించిన గందరగోళం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ నిరసనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్ తీరుపై జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం వైసీపీ సంఖ్య ఆధారంగా ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదని, ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు స్పందించారు. చాలారోజుల తర్వాత వైసీపీ నేతలు పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతల కామెంట్స్‌పై జనసైనికులు అదేస్థాయిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఏకంగా శాసనసభ వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ తీరును దుయ్యబట్టారు. తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించబోరన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నేతల తీరు ఏ మాత్రం ఆమెదయోగ్యం కాదన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ వైఫల్యాలను ఎండగట్టారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు చూస్తే టెర్రరిజం గుర్తుకు వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శాసనసభ వేదికగా పవన్ ప్రసంగం వైసీపీ నేతలకు తగలాల్సినచోట తగిలిందనే చర్చ జరుగుతోంది.
వైసీపీ టార్గెట్‌గా
శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలు శాసనసభలో ఎంతో బాధ్యతగా వ్యవహారించారని, తమ తప్పులేకపోయినా గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఈ ఒక దెబ్బతో వైసీపీని పవన్ కళ్యాణ్ క్లీన్ బౌల్డ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ సభ్యులు చేసిన పొరపాటుపై క్షమాపణలు చెప్పరనే ఉద్దేశంతో తానే గవర్నర్‌కు సారీ చెబుతున్నానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం ద్వారా రాజకీయంగా జనసేనకు ఎంతోకొంత కలిసొస్తుందనే చర్చ లేకపోలేదు. పొరపాటు ఎవరు చేసినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను బాధ్యత వహిస్తూ క్షమాపణలు కోరడం ద్వారా పవన్ వ్యక్తిత్వం బయటపడుతుందని, అవతిలి వ్యక్తులు మొండిగా వ్యవహారించడం ద్వారా ప్రజల్లో పరపతి తగ్గుతుందనే ప్రచారం ఉంది. మొత్తానికి వైసీపీ నేతల విమర్శలకు పవన్ కళ్యాణ్ శాసనసభ వేదికగా గట్టిగా ఇచ్చిపడేశారని, ఇక జనసేనపై విమర్శల విషయంలో ఆచితూచి వ్యవహారించే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది.
గతంలోనూ..
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేనను టార్గెట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. గత అనుభవాలు దృష్టిలో ఉన్నప్పటికీ మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ ఎలాంటి ప్రయోజనం పొందుతుందో ఆ పార్టీ నాయకులకే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ పవన్ కొట్టిన దెబ్బ గట్టిగానే తగిలిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here