Home » Pinnelli Venkatarami Reddy
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ (AP Election 2024) రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన కలకలం రేపింది.
Minister Ambati Rambabu Ticket Issue: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో (YSR Congress) నేతలను ‘టికెట్’ భయం ఇంకా వీడలేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు పలువురు సీనియర్ నేతలు, మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ఇప్పటికే సుమారు 60 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ‘సిద్ధం’ పేరిట (Siddam) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జగన్ కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ (Sattenapalli) ఇవ్వట్లేదని తెలిసింది...