Home » Pithapuram
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో.. ప్రజల మూడ్ను మార్చేందుకు జగన్ అండ్ కో అనేక కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు జగన్ గెలవడంతో పాటు.. మరోవైపు విపక్షంలో కీలక నేతలను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది.
ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సినీ నటులు కొన్ని పార్టీలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం కొడవలిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తన బాబాయిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
పిఠాపురంలో తనను ఓడించేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటూ ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం స్పందించారు.
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతాకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లడగడానికి వస్తారా..? అంటూ మహిళలు నిలదీశారు. పిఠాపురంలోని గొల్లప్రోలు పట్టణంలోని 20వ వార్డులో ఈ పరిస్థితి ఎదురైంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెనుక వీధిలో ప్రచారం నిర్వహిస్తూ రోడ్డు పక్కన ఇళ్లలో ఉన్న మహిళలను పిలిచారు...
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి గానూ పవన్ ఏప్రిల్ 23న నామినేషన్(Nomination) సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) నగరా మోగడంతో.. అధికార, విపక్షాల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో నియోజకవర్గంలో ఏ ఇల్లూ వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. పిఠాపురంలో (Pithapuram) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలోకి దిగడంతో.. ఆయన్ను ఓడించడానికి వైసీపీ ఏం చేయడానికైనా వెనక్కి తగ్గట్లేదు. ఒక్కో మండలానికి ఒక్కో సీనియర్ నేతను ఇంచార్జ్గా నియమించి అడ్డదారుల్లో గెలవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది వైసీపీ..
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు
జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ (Pothina venkata mahesh) సోమవారం నాడు ఆ పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.