Home » Pithapuram
Andhrapradesh: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని.. కానీ తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు.
పిఠాపురం: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
వైసీపీ పాలనలో సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోల పిచ్చి పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే.
జులై 1వ తేదీ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహించనున్నారు.
ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సవాలు చేస్తుంటారు. పేరు మార్చుకుంటానని కొందరు, ముక్కు నేలకు రాస్తానని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరికొందరు.. క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు.
పిఠాపురం నియోజకవర్గ (Pithapuram Constituency) ప్రజల్ని ఈనెల 20వ తేదీ తర్వాత కలవనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్గా తీసుకున్నారు..
పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.. జనసేన ఒక పార్టీనా అంటూ ఎంతోమంది ఐదేళ్ల క్రితం హేళన చేశారు. ఎదుటివారి విమర్శలకు కుంగిపోలేదు. వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయ రణరంగంలో వెనక్కి పారిపోలేదు. ఓడిపోయానంటూ హేళనచేసినవారికి తగిన గుణపాఠం చెబుతానంటూ సవాల్ విసిరారు.
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.