Share News

AP Politics: ప్రజలతో మమేకమవుతూ.. ప్రతి పనిలో పవన్ మార్క్..

ABN , Publish Date - Jul 04 , 2024 | 05:07 PM

రాజకీయాల్లో కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులు తక్కువుగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడ కనిపిస్తారు.

AP Politics: ప్రజలతో మమేకమవుతూ..  ప్రతి పనిలో పవన్ మార్క్..
Pawan Kalyan

రాజకీయాల్లో కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులు తక్కువుగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడ కనిపిస్తారు.అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురుచూస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడే తనలో నాయకత్వ లక్షణాలు, పనితనాన్ని నిరూపించుకోగలరు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కితాబు ఇస్తున్నారు. ఇంతకీ దేనికోసం అనుకుంటున్నారా.. అయితే ఈస్టోరీ చదవండి.

Deputy CM Pawan: పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా!


ఇచ్చిన మాట కోసం

ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురాన్ని శాశ్వత నివాసంగా ఏర్పరచుకుంటానని అక్కడి ప్రజలకు మాటిచ్చారు పవన్ కళ్యాణ్. సరిగ్గా గెలిచిన తర్వాత నెల తిరగకుండానే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మూడెకరాల స్థలం కొని.. ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స్థలంలో క్యాంపు ఆఫీసుతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. గెలిచేవరకు ఓ మాట.. గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించకుండా పోయిన నాయకులను ఎంతోమందిని చూమని.. కానీ డిప్యూటీ సీఎం అయినా.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పిఠాపురాన్ని శాశ్వత నివాసంగా చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారంటూ ప్రశంసిస్తున్నారు.

MP Kesineni Sivanath: విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..


ఎన్నో విమర్శలు..

పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని నాయకుడని.. రాజకీయాలకు పనికిరాడంటూ ఎంతోమంది హేళనచేశారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ పనితీరు, ఆలోచన విధానం చూసిన తర్వాత పవన్ ను విమర్శించిన వాళ్ల నోళ్లు మూతపడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. నాయకుడంటే పవన్‌లా ఉండాలంటున్నారు. నెలరోజుల తన పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారట పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సొంత నియోజకవర్గం పిఠాపురానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారట. నియోజకవర్గంలో తిరుగుతూ.. తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడు నెలల్లో రహదారుల మరమ్మతులు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏరికోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్న జనసేనాని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు.

Anitha: పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్


స్థానికంగా నివాసం..

పక్కా లోకల్ అంటూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థిర నివాసాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. కేవలం తాను ఉండటానికే కాకుండా తన కోసం వచ్చే వేలాది మంది ప్రజలను కలుసుకోవడంతో పాటు.. తన నియోజకవర్గం ప్రజలు ఎప్పుడైనా తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునేవిధంగా రెండెకరాల విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయం నిర్మాణం చేపట్టనున్నారట. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు ఇక్కడి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలతోనే నేనంటూ ముందుకెళ్తున్నారని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ స్పీడ్ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందట. ఓవైపు సీఎం చంద్రబాబు తన పాలనా అనుభవంతో ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంటే.. పవన్ కళ్యాణ్ సైతం తన వర్కింగ్ స్టైల్‌తో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందట. వీరిద్దరి మార్క్ పాలనతో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట.


YSRCP: ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా వైసీపీ సమావేశం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 04 , 2024 | 05:52 PM