Home » PM Modi
జమ్మూ కశ్మీర్ మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అందులోభాగంగా జమ్మూలోని ఎమ్ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఈ విడతలో జమ్మూ డివిజన్లో మిగిలిన 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు.
నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన మోదీ సోమవారం రాత్రి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి క్వాడ్ దేశాల సమావేంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రతి భారతీయుడి ఆత్మను కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ స్పందించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్ట’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.
ప్రధాని మోదీ ‘మనసులోని మాటల’ను చెబుతున్నారే తప్ప ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన ‘పనుల మాటల’ను మాట్లాడడం లేదని విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
న్యూయార్క్, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.