Share News

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:35 PM

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

కర్నూలు: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విమర్శలు చేశారు. వైసీపీ పాలన హిందూవులను కించపరిచే విధంగా ఉందని జగన్‌ను ప్రధాని మోదీ ఎన్నోసార్లు హెచ్చరించారని... ఇది వాస్తవం కాదా అని మ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు.


ALSO READ: Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..

జగన్ బురదను... బీజేపీకి కూడా అంటించాలనుకుంటున్నారని.. ఇది విచిత్రమైన వాదన అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విమర్శించారు. కూటమి ప్రభత్వం ఏర్పడక పోయింటే ఈ దుర్మార్గం ఇంకా కొనసాగేదని అన్నారు. లడ్డూ నాణ్యత లేదని సీఎం చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు అపచారం చేసి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జగన్‌ను, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలను అరెస్టు చేస్తే అసలు విషయం బయట పడుతుందని మ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.


ALSO READ: Bhumana Karunakar Reddy Video: టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

లడ్డూలో కల్తీ జరిగిందని తెలిశాక విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు. జగన్ తిరుమలని అన్యమతస్తుల చేతిలో పెడితే.. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం చేతిలో పెడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 06:42 PM