PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ
ABN , Publish Date - Sep 28 , 2024 | 09:30 AM
జమ్మూ కశ్మీర్ మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అందులోభాగంగా జమ్మూలోని ఎమ్‌ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఈ విడతలో జమ్మూ డివిజన్‌లో మిగిలిన 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
శ్రీనగర్, సెప్టెంబర్ 28: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అందులోభాగంగా స్థానిక ఎమ్‌ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన జమ్మూ డివిజన్‌లోని జమ్మూ, సాంబ, కత్వా, ఉదంపూర్ జిల్లాలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Also Read: Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పటికే వరకు ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ మూడు సార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 10 ఏళ్ల అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.
Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఓటరు ఏ పార్టీకి పట్టం కడతారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్‌కు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత సెప్టెంబర్ 18, 25 తేదీల్లో జరిగాయి. ఇక మూడో విడత అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు...
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో కుల్గాం జిల్లాలోని అడిగమ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నాంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఆ గ్రామంలో భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎదురు కాల్పులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ మేరకు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్ చేశారు. ఈ నెలలో ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
For National News And Telugu News..