Home » Police
ఇండిగో విమానానికి మంగళవారం రాత్రి 10.24 గంటలకు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. 6E 5149 విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 196 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిట ఫోర్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానం తనిఖీ చేసేందుకు ప్రయాణికులు చక్కని సహకారం అందజేశారని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు.
సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది.
నగరంలో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బైక్ రేసింగ్(Bike Racing)కు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న 10మందిని అరెస్టు(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది భార్య. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. రెండోసారి ట్రై చేసింది. ఈ సారి భర్త చనిపోయాడు. ప్రియుడితో కలిసి ఎంచక్కా కులుమనాలి వెళ్లింది. అంత సవ్యంగా సాగుతోన్న వేళ ఆ వివాహిత బావ రంగంలోకి దిగారు. అతని రిక్వెస్ట్ మేరకు కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్‌లో పట్టుబడ్డ కొందరు పోలీసులు జైల్లో ఉన్నారని .. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghundan Rao) హెచ్చరించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబీకి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్‌లో హార్డ్ డిస్క్‌లు సీజ్ చేశారు. మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసెస్‌తో పాటు హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది.
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌కు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎ్‌సలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు నాన్ కేడర్ ఎస్పీలు కూడా ఉన్నారు.
రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంత మంది సీనియర్ ఐఏఎ్‌సలకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. కలెక్టర్లుగా ఉండి, బదిలీ అయిన 10 మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు. యువతి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.