Raghunandan Rao: నేను ఎవరికి భయపడను.. రఘునందన్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Jun 18 , 2024 | 05:10 PM
బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్‌లో పట్టుబడ్డ కొందరు పోలీసులు జైల్లో ఉన్నారని .. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghundan Rao) హెచ్చరించారు.
మెదక్: బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్‌లో పట్టుబడ్డ కొందరు పోలీసులు జైల్లో ఉన్నారని .. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) హెచ్చరించారు. మెదక్‌లో ఇటీవల జరిగిన అల్లర్లలో అరెస్టై మెదక్ సబ్ జైల్లో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను రఘునందన్ రావు పరామర్శించారు.
రెండు రోజుల క్రితం జరిగిన మెదక్ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని తెలంగాణ డీజీపీ రవికుమార్ గుప్తాను డిమాండ్ చేశారు. ఐజీ రంగనాథ్ అత్యుత్సాహం చూపుతున్నారని వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఏ గతి పట్టిందో మెదక్ పోలీసులకు అదే గతి పడుతుందని.. తాను ఎవరికి బయపడనని హెచ్చరించారు.
హిందువులకు ఓ నీతి ..ముస్లింలకు ఓ నీతిలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళ ఏఎస్ఐను బూతులు తిట్టిన వారిపై కూడా ఏం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రెండు రోజులు తాను సంయమనం పాటించానని చెప్పారు. అరిఫ్ గాయపడి ఏ హాస్పిటల్లో ఉన్నారని ప్రశ్నించారు. అరిఫ్‌ను వెంటనే అరెస్టు చేయాలని.. చట్టాన్ని సమర్థంగా పనిచేయించాలని రఘునందన్ రావు కోరారు.