Home » Police
తమ జాడ కనుగొనేందుకు ఇల్లెందుల ఏసు అనే వ్యక్తిని పోలీసులే అడవిలోకి పంపగా మందుపాతర తొక్కి అతడు మరణించాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఏసు మరణానికి పోలీసులే బాఽధ్యులని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంటూ
చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ తనను కొట్టారని బాలీవుడ్ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.
ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లోని ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన విద్యుత బిల్లులు రూ.1.10 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారు. సరిహద్దు గ్రామాల్లో ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. మండలంలోని గౌడనహళ్లి, క్యాంపురం, గౌరిపురం, ఆర్ అనంతపురం, పాపసానిపల్లి, యు రంగాపురం మణూ రు, చందకచర్ల గ్రామాల్లో సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటుచేసి సిబ్బందిని నియమించారు.
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల్లో నిందితులైన కమిటీలోని కొందరు సభ్యులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకోవడంతో పాటు ఆర్థిక నేరాల పరిశోధనా విభాగానికి బదలాయించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.
కౌంటింగ్ ప్రారంభం అయిన కొద్ది సమయంలోనే మండల కేంద్రంలో టీడీపీ నాయకులు 11గంటలకే స్థానిక బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. టీడీపీ కూటమి 137స్థానాల్లో ముందంజలో ఉందని తెలియటంతో మిఠాయిలు పంపిణీ చేస్తూ బాణా సంచాలు కాల్చే ప్రయత్నాలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగు తమ్ముళ్లు సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఎద్దులపల్లి సర్కిల్‌లో టీడీపీ విజయోత్సవ సంబరాలను సీఐ రాజశేఖర్‌రెడ్డి తన సిబ్బందితో అడ్డుకున్నారు.
సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అడవిలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు.. కట్టెల కోసం వెళ్లిన ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన ములుగు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వాజేడు మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇల్లెందుల ఏసు (55) తన కుమారుడు రమేశ్, మరో ముగ్గురితో కలిసి కట్టెల కోసమని కొంగాల అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.
ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల మధ్య సరిహద్దుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రోజుల నుంచి దేవస్థానం పరిధిలో సరిహద్దుల విషయంలో అటవీశాఖ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.