Home » Police
అంతర్జాతీయ మానవ అవయవ అక్రమ రవాణా మాఫియాలో మాస్టర్‌మైండ్‌గా ఉన్న రాంప్రసాద్‌ను కేరళ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన బి.రాంప్రసాద్ అలియాస్ ప్రతాప్ మానవ అవయవ అక్రమ రవాణా ముఠాలో మాస్టర్‌మైండ్ అని ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సెనా తెలిపారు.
ఓ స్థలం వివాదానికి సంబంధించి నమోదైన కేసును మూసేయడానికి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ కుషాయిగూడ సీఐ, ఎస్సై సహా మరో మధ్యవర్తి ఏసీబీకి దొరికిపోయారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ జి.వీరస్వామి, ఎస్సై షేక్ షఫీతోపాటు మధ్యవర్తిత్వం నెరిపిన ఉపేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాజీజానసైదా హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో రౌడీషీటర్‌లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఏసీబీ అధికారులు విస్తృత దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) దుష్ప్రచారం చేస్తూ ప్రసారం చేసిన ఓ వార్త ఛానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balkasuman) శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భర్త తేజపై మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వివరించారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చానని తెలిపారు.
హైదరాబాద్: డిపాజిట్ల పేరుతో రూ.200 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ (TSCAB ) నిమ్మగడ్డ వాణి బాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
డిగ్రీ చేసి.. పని, పాటా లేని యువకుడు తన క్లాస్ మేట్ అయిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని ఆ యువతితో చెబితే తిరస్కరించింది. ఆ విషయం మనసులో పెట్టుకున్న యువకుడు యువతిని దారుణంగా హతమార్చాడు. తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP K. Srinivas Reddy) సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో గురువారం పోలీస్, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సౌమ్యుడిలాా కనిపించే రవీంద్రలో చాలా లక్షణాలున్నాయి. ఇన్‌స్పెక్టర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్నప్పటికీ తానే ఇన్‌స్పెక్టర్‌లా వ్యవహరించేవాడు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు రైటర్, అడ్మిన్ ఎస్‌ఐ వద్దకు వెళ్తాయి. ఇలా వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటినే ఇన్‌స్పెక్టర్ టేబుల్‌పై పెట్టేవాడు. ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో వచ్చిన సివిల్ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను తన వద్ద పెట్టుకునేవాడు.