Share News

Hyderabad: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత..

ABN , Publish Date - May 31 , 2024 | 10:33 AM

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ సీపీ కె.శ్రీనివాస్‌ రెడ్డి(Hyderabad CP K. Srinivas Reddy) సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో గురువారం పోలీస్‌, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Hyderabad: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత..

హైదరాబాద్‌ సిటీ: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ సీపీ కె.శ్రీనివాస్‌ రెడ్డి(Hyderabad CP K. Srinivas Reddy) సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో గురువారం పోలీస్‌, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ సెంటర్ల వద్ద ఏర్పాట్లు, బందోబస్తు, రిటర్నింగ్‌ అధికారులతో సమన్వయం, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతి, ఏజెంట్లు, మీడియా సెంటర్‌ ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు.

ఇదికూడా చదవండి: Passport: ఐదు రోజులుగా.. పాస్‌పోర్టు సేవలు బంద్‌..


హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) పార్లమెంట్‌ ఎన్నికలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక(Cantonment Assembly by-election) సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 31 , 2024 | 10:34 AM