Home » Police
అల్లూరు జిల్లా జి.కె.వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్(Maoist dump) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా(Tuhin Sinha) వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు శుక్రవారం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని బెంగాల్‌లోనే అరెస్టు చేశారు.
పట్టణంలోని నందలపాడులో డీఎస్పీ జనార్దననాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం కార్డెన సెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌మాంగర్స్, పాతకేసుల్లో నిందితుల ఇళ్లు, పరిసరాలు, గడ్డివాముల్లో తనిఖీలు చేశారు. నందలపాడుప్రధాన వీధుల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. కౌంటింగ్ రోజు, ఆ తరువాత గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానికులను డీఎస్పీ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. పట్టణంలో 144 సెక్షన ...
మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులో మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్(International kidney rocket) వెలుగు చూసింది. కేరళకు చెందిన యువకుడి మృతితో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిగా గుర్తించారు. కొంతకాలంగా పేదలకు డబ్బు ఆశ చూపి విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేస్తూ దందా సాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న యువకుడు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
కల్తీ కల్లు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పెనుకొండ డీఎస్పీ బాజీజాన సైదా హెచ్చరించారు. మడకశిర నియోజకవర్గంలో కల్లుగీత యజమానులు, కార్మికులతో ఆయన గురువారం మడకశిర సర్కిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... రసాయనాలు కలిపి కల్తీ కల్లు విక్రయించే వారిపై పీడీ యాక్ట్, అబ్కారీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు.
పుణేలో నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇద్దరు ప్రాణాలకు పోయేందుకు కారణమైన మైనర్ కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఆ రోజు కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గంటల్లో బెయిల్ రావడం.. తిరిగి జువైనల్ హోంకు తరలించడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఆ బాలుడు ఆ రోజు కారు తాను నడపలేదని కొత్త భాష్యం చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేసింది ఫ్యామిలీ డ్రైవర్ అని వివరించారు.
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 12 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్‌లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.
నగరంలో ఓ మహిళ ఎస్ఐ దౌర్జన్యానికి దిగారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులపైనే సదరు ఎస్ఐ దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ నెల 17వ తేదీన మధురానగర్‌లో ఓ వైన్స్ షాపు సిబ్బంది దాడిలో గాయపడిన రమేష్ దంపతులు ఫిర్యాదు చేసేటందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy) బాగోతం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి నరసరావుపేట కోర్టు ఆవరణలో లోంగిపోతారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పహారా కాస్తున్నారు.