Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6
ABN , Publish Date - May 24 , 2024 | 05:38 PM
మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం నాడీ తెలిసినందునే పిన్నెల్లి అరాచకానికి పూనుకున్నారు.
కాల్చిపారేసేవారు..?
‘మాచర్ల నియోజకవర్గం సున్నితమైన ప్రాంతం. ఇక్కడ కేంద్ర బలగాలను మొహరించాలి. ఏం జరిగిందో తెలియదు.. ఇక్కడ రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారు. ఒకవేళ కేంద్ర బలగాలు డ్యూటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిని అక్కడికక్కడే కాల్చి పారేసేవారు. లేదంటే రెక్కలు విరిచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే వారు. సున్నిత ప్రాంతం అని తెలిసినప్పటికీ అక్కడ కేంద్ర బలగాలు ఎందుకు విధుల్లో లేరు..? ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా... లేదంటే పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? పిన్నెల్లి ప్రోద్బలంతో నియమించలేదా అని’ వర్ల రామయ్య సూటిగా ప్రశ్నించారు.
సమాధానం కావాలి..
‘మాచర్లలో కేంద్ర బలగాలను ఎన్ని బూత్‌ల వద్ద నియమించారు. ఎక్కడ వారి సేవలు వినియోగించారు. మాచర్ల పోలీసులు సమాధానం చెప్పాలి. పిన్నెల్లి పవిత్రుడని, ఏ నేరం చేయని అమాయకుడని, సీఎం జగన్ రెడ్డికి ఇష్టమైన వాడని ఈవీఎం బద్దలు కొట్టాడని సజ్జల బుకాయిస్తున్నాడు. ఎందుకు మీ మేకపోతు గాంభీర్యం. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఆ విప్లవమే పిన్నెల్లి అరాచకాలను పాతిపెట్టింది. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. సీఎం జగన్ అరాచక సామ్రాజ్యాన్ని కూల దోయనుంది. పిన్నెల్లి పగలగొట్టిన ఈవీఎం బాక్సులో కింద పడిన ఓట్లర్ స్లిప్పులో ఆ విషయం స్పష్టమైంది. అందులో టీడీపీకి 22 ఓట్లు, 6 ఓట్లు వైసీపీకి పడ్డాయి. అందుకే కావచ్చు పిన్నెల్లి విధ్వంసానికి తెరలేపాడు అని’ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Latest APNews and Telugu News