Home » Police
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్(Police Encounter) జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఎన్నికల గొడవల నేపథ్యంలో భద్రత విధులకు వచ్చిన పోలీసులకు భోజనం కష్టాలు వెంటాడుతున్నాయి. సరైన భోజనం అందక సిబ్బంది.. భోజనం ఏర్పాట్లకు నిధులు లేక పోలీసు అధికారులు తిప్పలు పడుతున్నారు. పోలింగ్, ఆ మరుసటి రోజున గొడవలతో తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఎన్నికల కమిషన సీరియస్ కావడంతో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకుంది. సాధారణ పోలీసులతోపాటు ర్యాపిడ్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది బందోబస్తు విధుల్లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు, అనంతపురం బెటాలియన్ల నుంచి వచ్చిన ...
పట్టణంలో వనటౌన పోలీస్ స్టేషన పరిధిలోని హస్నాబాద్‌లో బుధవారం పోలీసులు కారెన సర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో, తరువాత ఎటువంటి ఘటన లు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివా సులు తెలిపారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున పలు ఇళ్లలో సోదాలు చేశారు. అదే విదంగా పర్మిట్‌లు లేని 16 ద్విచక్రవాహనాలను సీజ్ చేసి వన టౌన పోలీస్ స్టేషనకు తరలించారు.
ఎన్నికల నియామవళిని అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవని పుట్టపర్తి రూరల్ సీఐ రాగిరి రామయ్య హెచ్చరించారు. బుధవారం మండలంలోని కొత్తకోట గ్రామంలో పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ భాగ్యరేఖ పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సబ్‌డివిజన పోలీసు అధికారి వాసుదేవన అధ్యక్షతన శాంతిభద్రతల సమస్యలపై ఆర్డీఓ సమీక్షించారు.
పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన కొందరు బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష్యతో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారంటూ ఎస్సైపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం బాటిళ్లతో వెళుతోన్న లారీ హైదరాబాద్ బోయిన్ పల్లి వద్ద బోల్తా పడింది. మద్యం బాటిళ్లు చెల్లాచెదురుగా అక్కడ పడి ఉన్నాయి. వాటిని చూసిన కొందరు తీసుకెళ్లేందుకు గుమికూడారు. లారీ బోల్తా పడిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్, వైన్ షాప్ సిబ్బంది కూడా వచ్చారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను మోసం చేశారంటే.. తమను ఛీట్ చేశారంటూ బాధితులు బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లూ తాము భయపడి ముందుకు రాలేదని స్పష్టం చేశారు.