Share News

TG News: వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..?

ABN , Publish Date - May 22 , 2024 | 09:58 PM

పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన కొందరు బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష్యతో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారంటూ ఎస్సైపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG News: వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..?

వికారాబాద్ జిల్లా: పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన కొందరు బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష్యతో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారంటూ ఎస్సైపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చిన్న గొడవ జరిగింది.


ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎప్ఐఆర్ నమోదు చేసి ఈ రోజు ఉదయం నలుగురిని అరెస్ట్ చేసి పీఎస్‌కు పోలీసులు తరలించారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్వవహరిస్తున్నారంటూ ఆరోపించారు. పరిగి డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 09:59 PM