Share News

ACP Uma Maheswara Rao: వెలుగులోకి ఉమమహేశ్వరరావు లీలలు..!!

ABN , Publish Date - May 22 , 2024 | 05:14 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను మోసం చేశారంటే.. తమను ఛీట్ చేశారంటూ బాధితులు బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లూ తాము భయపడి ముందుకు రాలేదని స్పష్టం చేశారు.

ACP Uma Maheswara Rao: వెలుగులోకి ఉమమహేశ్వరరావు లీలలు..!!
ACP Uma Maheswara Rao

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను మోసం చేశారంటే.. తమను ఛీట్ చేశారంటూ బాధితులు బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లూ తాము భయపడి ముందుకు రాలేదని స్పష్టం చేశారు.


కోర్టులో హాజరు

ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాలపై లోతుగా దర్యాప్తు జరపాలని న్యాయస్థానానికి ఏసీబీ అధికారులు వివరించారు. ఉమా మహేశ్వర్ రావుకు కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు.


ఏబీఎన్‌ను ఆశ్రయించిన బాధితుడు

శ్రీనివాస్ నాయక్ అనే బాధితుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు. ఏసీపీ ఉమామహేశ్వర రావు వేధింపులకు భరించలేక పోయానని వివరించారు. వేధింపులు తాళలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ‘ఇబ్రహీంపట్నంలో ఉమామహేశ్వర రావు ఏసీపీగా పని చేసే సమయంలో నేను ల్యాండ్ కేసులో ఫిర్యాదు చేశా. నా భూమి కబ్జా చేసే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టా. నిందితులపై చర్యలు తీసుకోవాలంటే రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. నేను డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితులగా ఉన్న రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షలు తీసుకొని నాపై 2 కేసులు పెట్టాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. కాలుతో తన్ని.. రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరించాడు. నేను కంప్లైంట్ చేసిన కేసులో నిందితులకు వత్తాసు పలికి ఆ కేసును నీరుగార్చాడు. నాపై పెట్టిన కేసులో హైకోర్టు వెళ్లి న్యాయ పోరాటం చేశాను. ఆ కేసులు చెల్లవని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏసీపీ ఉమామహేశ్వరరావుపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అని’ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.


సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో మంగళవారం నాడు 14 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు చేశారు. అశోక్‌నగర్‌లో గల నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ కార్యాలయం, నగరంలో మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల సోదాలు నిర్వహించారు. ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన 17 ప్రాపర్టీలను సీజ్‌ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమాస్తుల విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఘట్‌కేసర్‌లో ఐదు, విశాఖ, చోడవరంలో ఏడు చోట్ల భూములు, హైదరాబాద్‌లో నాలుగు ఇళ్లు, శామీర్‌పేట్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరిలో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఏసీపీ డైరీలో సందీప్‌ అనే పేరు ఉందని, అతను ఎవరనేది దర్యాప్తు చేస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఉమామహేశ్వర రావు ఆస్తి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.



Read Latest
Telangana News and National News

Updated Date - May 22 , 2024 | 05:28 PM