Home » Police
గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను మత్స్యకారులు రక్షించారు. కోవ్వూరు - రాజమండ్రి బ్రిడ్జ్‌పై నుంచి మహిళ నదిలో దూకుతుండగా రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
మండలంలోని కోమటికుంట్ల గ్రామం లో టీడీపీ, వైసీపీ వ ర్గాల ఘర్షణ నేపథ్యంలో చికిత్స పొం దుతూ వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య మృ తిచెందడంతో గ్రామం లో పోలీస్ పికెట్ ఏ ర్పాటుచేశారు. 60మం ది సిబ్బంది, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) జులై 1నుంచి అమలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 వేల 500 పోలీస్ స్టేషనల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
శ్రీలంకలో అన్‌లైన్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 60 మంది భారత జాతీయులను ఆ దేశ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారులోని మాడివేల, బట్రాముల్లాతోపాటు పశ్చిమ తీర పట్టణం నెగొంబోలో దాడులు చేసి వీరిని సీఐడీ అదుపులోకి తీసుకుందని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు.
ఒడిశా నుంచి మహారాష్ట్ర(Odisha to Maharashtra)కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్(Bank Manager) పరిస్థితి. తాను పనిచేస్తున్న బ్యాంక్‌నే మోసం చేసి కోట్లాది రూపాయలను తన సొంత అకౌంట్‌లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ కేసులో నాలుగు నెలల అనంతరం అతడిని బుధవారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చెరువులో చేపలు పట్టుకుంటున్న జాలర్లను బెదిరించిన ఓ రౌడీషీటర్(Rowdy sheeter) వారి వద్ద డబ్బు లాక్కున్నాడు. నార్సింగ్ పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన ఇర్ఫాన్ సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పీరంచెరువు కట్టపై మద్యం తాగాడు.
ఐదుగురు గంజాయి బ్యాచ్ పోకిరీలు బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వారిని నేరేడ్‌మెట్ పోలీసులు(Neredmet Police) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో పరిచయం అయిన బాలికను నిందితుడు విజయ్‌కుమార్ మాయమాటలతో లోబర్చుకున్నాడు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాను నడుపుతున్న ట్రాక్టర్ నుంచి అకస్మాత్తుగా దూకి పరారయ్యాడు.