Viral Video: గోదావరిలో దూకిన మహిళ..సోషల్ మీడియాలో వైరల్

ABN, Publish Date - Jun 29 , 2024 | 01:37 PM

గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను మత్స్యకారులు రక్షించారు. కోవ్వూరు - రాజమండ్రి బ్రిడ్జ్‌పై నుంచి మహిళ నదిలో దూకుతుండగా రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను మత్స్యకారులు రక్షించారు. కోవ్వూరు - రాజమండ్రి బ్రిడ్జ్‌పై నుంచి మహిళ నదిలో దూకుతుండగా రహదారిపై వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మత్స్యకారుల సహాయంతో పోలీసులు ఆమెను రక్షించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో తీసుకు వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులకు ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి..ఆమెను వారికి అప్పగించారు.

Updated at - Jun 29 , 2024 | 02:03 PM