Home » Politicians
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్ నటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.
ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు.
రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు.
వివిధ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి ప్రధాని మోదీకి సవాలు విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రఽధానే ముందుకు రాకపోవచ్చని అన్నారు.
అంజన్ ఆద్మీ పార్టీ.. ఆప్కీ అప్నీ పార్టీ.. గరీబ్ ఆద్మీ పార్టీ..! ఇవెక్కడి పార్టీలు..? ఈ పేర్లే వినలేదు ఎప్పుడూ అనుకుంటున్నారా? సరే.. లాగ్ పార్టీ, హమారా సాహి వికల్ప్ పార్టీ.. ఓటర్స్ పార్టీ..! మరి వీటి గురించైనా తెలుసా..
లోక్‌సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...