Suresh Gopi : మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా!
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:24 AM
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
సినిమా లేకపోతే బతకలేను.. 22 సినిమాలకు అంగీకరించా
మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపి
కొచి, ఆగస్టు 22: సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు. సినిమా తన శ్వాస అని, అది లేకపోతే బతకలేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం 22 సినిమాలకు తాను ఆమోదం తెలిపానని, వాటిల్లో నటించేందుకు అనుమతి కోసం తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిస్తే.. ఆయన తన విజ్ఞాపనపత్రాన్ని పక్కనపెట్టారని, అయినప్పటికీ అనుమతి ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. కేరళ చలనచిత్ర వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సురేష్ గోపి ఈ వివరాలు వెల్లడించారు.