Share News

Supreme Court : ఒక్కడే 41 మందిని గాయపర్చాడా

ABN , Publish Date - Sep 03 , 2024 | 02:46 AM

పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ నాయకుడు సయాన్‌ లాహిరి బెయిల్‌ను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

Supreme Court : ఒక్కడే 41 మందిని గాయపర్చాడా

  • బెంగాల్‌ సర్కారుపై సుప్రీంకోర్టు ఫైర్‌

  • ఛాత్ర సమాజ్‌ నేత బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ నాయకుడు సయాన్‌ లాహిరి బెయిల్‌ను సవాల్‌ చేస్తూ బెంగాల్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆందోళనలకు సంబంధించి ఆయన ఒక్కడినే ఎందుకు అరెస్టు చేశారని.. ‘41 మంది పోలీసులను ఆయనే గాయపరిచారా’ అంటూ నిలదీసింది. కోల్‌కతా హత్యాచార ఘటనపై బెంగాల్‌ సర్కారు తీరును నిరసిస్తూ ఛాత్ర సమాజ్‌ గత నెల 27న రాష్ట్ర సచివాలయ ముట్టడికి చేపట్టిన ‘నబన్నా అభియాన్‌’ ర్యాలీ హింసాత్మకంగా మారి నిరసనకారులతో పాటు పోలీసులు గాయపడ్డారు. దీనికి బాధ్యుడిని చేస్తూ సయాన్‌ లాహిరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Updated Date - Sep 03 , 2024 | 02:46 AM