Home » Politics
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతోంది. సుహృద్భావ వాతావరణంలో,
విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ గడువును ఈనెల 31వ తేదీ దాకా పొడిగిస్తూ ....
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్‌సభ (Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనుంది..
ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి లేఖ రాసే అంశాన్ని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ పరిశీలిస్తోంది. ఆరోపణలు చేసిన విద్యుత్తు రంగ నిపుణులు, ఇతర ఫిర్యాదుదారులను ప్రశ్నించే (క్రాస్ ఎగ్జామిన్) అవకాశం కేసీఆర్‌కు ఇవ్వాలా? లేక వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలా? అనే దానిపై కమిషన్ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.
నల్లగొండ పట్టణ నడిబొడ్డులో రూ.100 కోట్ల విలువైన స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ వెంటనే నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
విద్యుత్ విచారణ కమిషన్ గడువు పెంచారా? లేదా? గడువును పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయా? లేవా? అని.. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి సోమవారం ఆరా తీసినట్లు సమాచారం.
విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం.. ఆయనకు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్.. చట్టం ముందు అందరూ సమానమేనన్న సంగతి మరిచారని విమర్శించారు. ఇకనైనా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఆయన హాజరై వాస్తవాలు చెప్పాలన్నారు.