Home » Ponnam Prabhakar
హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలకు తాము పాల్పడడం లేదని, బీసీలు అంటే ఎందుకంత ఆక్రోశం.. గతంలో ఈటెల రాజేందర్పై ఇలానే మాట్లాడారని మంత్రి అన్నారు.
కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని మహాంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీటిని రైతులకు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. BRS నాయకులు తమ జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి తండాకు, గూడేనికి బీటీ రోడ్లు వేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రతి గిరిజన ఆవాసానికి రవాణా, తాగునీటి సౌకర్యం, వారి పిల్లలు చదువుకునే అవకాశం కల్పించినప్పుడే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం, ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరినట్లు తాము భావిస్తామన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ఎప్పటిలోగా, ఏ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు.. పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన కాదని.. ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్కు(Bandi Sanjay) తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర బడ్జెట్లో తగినంత కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.