TG Assembly: సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Jul 30 , 2024 | 08:56 AM
హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలకు తాము పాల్పడడం లేదని, బీసీలు అంటే ఎందుకంత ఆక్రోశం.. గతంలో ఈటెల రాజేందర్‌పై ఇలానే మాట్లాడారని మంత్రి అన్నారు.
హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సోమవారం శాసనసభలో (Assembly) ఎమోషనల్ (Emotional) అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ (Hyderabad Brand Image)ను దెబ్బతీసే విధంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలకు తాము పాల్పడడం లేదని, బీసీలు అంటే ఎందుకంత ఆక్రోశం.. గతంలో ఈటెల రాజేందర్ (Etela Rajender)పై ఇలానే మాట్లాడారని మంత్రి అన్నారు. సభలో మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్స్ చేయకూడదన్నారు. ఆటో కార్మికులపై ముసలి కన్నీరు కార్చుతున్నారని.. ఉన్నదా? లేదా? అనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు, కొత్త బస్సులను కొంటున్నామని తెలిపారు. రెండు నెలలు ఆర్టీసీ కార్మికులు నిరసనలు చేసిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. మిస్ చార్జీలు కూడా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం పెంచలేదని ఆరోపించారు.
ఒక పార్టీ నుంచి పోటీ చేసి... మరొక పార్టీ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని క్యారెక్టర్ తనది కాదని, ఓకే ప్రభుత్వంలో ఒక మంత్రి ఎలా మిత్రుడు అవుతాడు? ఇంకో మంత్రి శత్రువు ఎలా అవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఫ్లై యాష్, ఇసుకపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉద్యమకారులపై రాళ్లు విసిరినవాళ్లు ఇవాళ ఉద్యమకారుల పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దమ్ము గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలని సూచించారు. పెళ్ళాం, పిల్లలను అడ్డంపెట్టుకుని ఓట్లు అడిగే వాళ్ళు ఇవాళ దమ్ము గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు విసిరిన వాళ్లు... ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారని.. ఆర్టీసీని చంపిన వాళ్లే... రిటైర్డ్ ఈడీతో ఆర్టీసీని నడిపిన వాళ్లే ఇవాళ ఆర్టీసీ గురించి ప్రశ్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్ట మొదటిసారిగా దాదాపుగా 17 గంటల పాటు ఏక ధాటిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సోమవారం ఉదయం10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ వాడి వేడిగా జరిగి ముగిసింది. ఆయా సభ్యులు లెవనెత్తిన అంశాలపై సభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు.
కాగా ఆరవ రోజు మంగళవారం తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. నిన్నంతా సభ చాలా వాడీవేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నిన్న సభ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికారపక్షంగా సాగింది. ఇక ఇవాళ కూడా శాసన సభలో ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరుగనుంది. నిన్న 17 గంటలకు పైగా శాసన సభ సాగింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రానుంది. సభలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు కూడా సభలో పద్దులపై చర్చించనున్నారు. తొమ్మిది శాఖలకు చెందిన పద్దులపై సభ చర్చించనుంది. మత్స్య శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ పద్దులపై నేడు చర్చించనుంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసన సభలో చర్చ జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫొటోల పిచ్చి ఖరీదు రూ. 700 కోట్లు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News