Home » Ponnam Prabhakar
బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సూచించారు. జూలై 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది.
అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ‘ ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు పంపించారు.
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.
రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండుసార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు రెండుసార్లు కలిపి సగంసగమే మాఫీ చేసినా రూ.21వేల కోట్లు నిధులు ఖర్చయ్యాయి.
రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలపై ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డితో భేటీ అయ్యారు.
కరీంనగర్: స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపామని, నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే విధంగా నగరంలో నిర్మించిన పలు జంక్షన్లకు కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.