Ponnam Prabhakar: రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 22 , 2024 | 09:10 PM
రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా: రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందులో తాను భాగస్వామిని కావడం రైతు బిడ్డగా సంతోష పడుతున్నానని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
రాహుల్ హామీ మేరకు కేబినెట్ తీర్మానం చేసిందని స్పష్టం చేశారు. విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. విడతల వారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ పూర్తవుతుందని మాటిచ్చారు. ఏ రోజు నుంచి రుణమాఫీ అమలు అవుతుందనేది త్వరలోనే విధి విధానాలు వస్తాయి .జీవో వస్తుందని చెప్పారు.
గతంలో లాగా విడతల వారీగా రుణమాఫీ కాకుండా ఒకేసారి అవుతుందని చెప్పుకొచ్చారు. రైతు బిడ్డగా సహచర మంత్రులకు , ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్ మంత్రిగా అందులో భాగస్వామ్యం అయినందుకు సంతోషాన్ని ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.