Home » PowerPoint
విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులను అతి తక్కువ కాలంలో పరిష్కరించేలా విద్యుత్ కంట్రోల్ రూమ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ (ఎఫ్‌వోసీ)లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు దక్షిణ డిస్కమ్ అధికారులు నిర్ణయించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు.
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.
ఉచిత/రాయితీతో విద్యుత్ పొందే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
‘సంస్థను నిలబెట్టుకోవాలంటే మీరు త్యాగాలు చేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తలోక చేయీ వేయకపోతే మనుగడ కష్టం. ఎవరి స్థాయిలో వారు...
విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్ పవర్ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.
తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్ ప్లాంట్ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి.
విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.