Share News

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:19 AM

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్‌ పవర్‌ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

  • నిధులు ఎన్నయినా కేటాయిస్తాం, ప్రతిపాదనలు పంపండి: భట్టి

నాగర్‌కర్నూల్‌/దోమలపెంట, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్‌ పవర్‌ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు. నిధులు ఎన్నయినా కేటాయిస్తామని, ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. సోమవారం ఆయన నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు.


అనంతరం సమీక్షా సమావేశంలో భట్టి మాట్లాడుతూ, విద్యుత్‌ పవర్‌ హౌస్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి చేసే హైడల్‌ పవర్‌ ఉత్పత్తిని పెంచుదామని అన్నారు. శ్రీశైలం డ్యాంకు దిగువన 16 కిలోమీటర్ల దూరంలో 10 సంవత్సరాల క్రితం నిర్మించిన సపోర్టు డ్యాంకు గండి పడటంతో ఎటువంటి ఉపయోగం లేకుండా పొయిందని, పునరుద ్ధరణకు త్వరలోనే నివేదిక తయారు చేయాలని సూచించారు. దీని వల్ల నిరంతర విద్యుత్‌ ఉత్పాదన జరుగుతుందని అన్నారు. రానున్న మూడు నెలల్లో వరద నీటితో 60 కోట్ల విద్యుత్‌ ఉత్పత్తిని తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని భట్టి ఆదేశించారు.

Updated Date - Jun 25 , 2024 | 03:19 AM