Share News

Southern DISCOM: వేగంగా విద్యుత్‌ సరఫరా ఫిర్యాదుల పరిష్కారం

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:19 AM

విద్యుత్‌ సరఫరాపై ఫిర్యాదులను అతి తక్కువ కాలంలో పరిష్కరించేలా విద్యుత్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ (ఎఫ్‌వోసీ)లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు దక్షిణ డిస్కమ్‌ అధికారులు నిర్ణయించారు.

Southern DISCOM: వేగంగా విద్యుత్‌ సరఫరా ఫిర్యాదుల పరిష్కారం

  • గణనీయంగా తగ్గిన ఫిర్యాదులు: దక్షిణ డిస్కమ్‌ సీఎండీ

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సరఫరాపై ఫిర్యాదులను అతి తక్కువ కాలంలో పరిష్కరించేలా విద్యుత్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ (ఎఫ్‌వోసీ)లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు దక్షిణ డిస్కమ్‌ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని పెంచుతూ ఏకకాలంలో 400 మంది ఫిర్యాదులు చేసినా అందుకునేలా మార్పులు చేశారు.


గురువారం డిస్కమ్‌ ప్రధాన కార్యాలయంలో 1912 కాల్‌ సెంటర్‌తోపాటు ఎఫ్‌వోసీల పనితీరుపై సంస్థ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సమీక్ష నిర్వహించారు. బ్రేక్‌డౌన్‌, ఫీడర్ల సమాచారంతో పాటు బిల్లింగ్‌, కలెక్షన్‌ల వివరాలతో సమీకృత డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చామని సీఎండీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆరు నెలలుగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులు గణనీయంగాతగ్గాయని చెప్పారు.

Updated Date - Aug 02 , 2024 | 03:19 AM