Home » Praja Galam
అధికార వైసీపీ (YCP) అరాచకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తుండటంపై.. పోలీస్ శాఖ (Police Department) మీద టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ (Election Code) వచ్చిన తర్వాత కూడా పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) బేఖాతరు చేస్తోంది. నిన్న(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో ఏపీ పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఏపీ సీఈఓ ఎంకే ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena)కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ సీఈఓను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, బాజీ నేతృత్వంలోని ఎన్డీఏ బృందం సభ్యులు కలిశారు.
వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వస్తున్నారంటేనే... కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ను ఆపేస్తారు! జగన్ రాజకీయ సభలకు ఎక్కడెక్కడో ఉన్న జిల్లాల నుంచీ పోలీసులను తరలించి మోహరిస్తారు.
‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ జనం వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు.
TDP-JSP-BJP Praja Galam Sabha: ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ రాష్ట్ర వికాసం కోసం పవన్, చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం (Praja Galam) సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) నిప్పులు చెరిగారు. మూడు ముక్కలాటతో అమరావతిని, రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని, సహజ వనరులను దోచేసిందని ఆరోపించారు.
చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో (Praja Galam Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని.. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశారని అన్నారు. పన్ను ఎగవేసి.. సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.