Praja Galam Highlights: వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు
ABN , First Publish Date - Mar 17 , 2024 | 01:14 PM
TDP-JSP-BJP Praja Galam Sabha: ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ రాష్ట్ర వికాసం కోసం పవన్, చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Live News & Update
-
2024-03-17T19:30:55+05:30
వికసిత్ ఏపీ మనందరి కల కావాలి: చంద్రబాబు
వికసిత్ భారత్ మోదీ కల.. వికసిత్ ఏపీ మనందరి కల కావాలి.
దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోదీకి మేం అండగా ఉంటాం.
దేశాన్ని జీరో పావర్టీ నేషన్‌గా చేయడం మోదీ వల్లే సాధ్యం.
2014-19 మధ్య కాలంలో ఏపీలో 11 కేంద్ర సంస్థలను తెచ్చాం.
మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరిగింది.
రాజధానిని జగన్ నాశనం చేశారు.
వైన్, మైన్, శాండ్, ల్యాండ్ అన్నింటిలోనూ అక్రమాలే.
ఐదేళ్లల్లో ప్రజల జీవితాల్లో ఆనందమే లేదు.
గంజాయి సరఫరా, వినియోగం పెరిగింది.
విధ్వంసమే జగన్ విధానంగా ఉంది.
ఏపీ పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నారు.
ఇద్దరు చెల్లెళ్లను కూడా జగన్ మోసం చేశారు.
వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని.. జగనుకు ఓటేయొద్దని జగన్ చెల్లెళ్లే చెప్పారు.
బ్యాడ్ గవర్నెన్స్ వల్ల ఏపీ నష్టపోయింది.
లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు.
ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారు.
ఈ విషయం ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నా..
కేంద్రంలో ఎన్డీఏకు 400+ స్థానాలు రావడం ఖాయం.
ఏపీలో 25 ఎంపీ స్థానాలను గెలవాలి.
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
-
2024-03-17T19:15:56+05:30
జన సంద్రంగా ప్రజాగళం సభ
జన సముద్రంగా మారిన బోపూడి ప్రజాగళం సభ
జాతీయ రహదారిపై ఇరువైపులా 20 కిలోమీటర్ల పైగా నిలిచిపోయిన వాహనాలు
ప్రజాగళం బహిరంగ సభకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు
తన సమయం అయిపోయినప్పటికీ ప్రజల ఉత్సాహం చూసి మరింత సమయం గడిపిన ప్రధాని మోదీ
-
2024-03-17T19:15:46+05:30
అమరావతిని జగన్ భ్రష్టుపట్టించారు: చంద్రబాబు
మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ భ్రష్టుపట్టించారు.
పోలవరాన్ని ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపేసింది.
సహజ వనరులను దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ పేరుతో జగన్ దోచేశారు.
గంజాయి, అశాంతితో రాష్ట్రాన్ని నాశనం చేశారు.
జగన్ రక్త దాహానికి చిన్నాన్న చనిపోయాడు. ఇద్దరు చెల్లెల్లు జగన్‌కు ఓటెయ్యోద్దు అన్నారు
ప్రధానిని కోరుతున్నా.. ఏపీ చాలా ఇబ్బందులు పడుతోంది.
కలెక్టరేట్ ఆఫీసు, రైతు బజార్ బిల్డింగ్ లాంటివి కూడా తనఖా పెట్టేసారు
మద్యం ఆదాయాన్ని ముందుగానే తనఖా పెట్టి ఎస్క్రో చేశారు
ఎన్డీఏకు 400 సీట్లు పైన వస్తాయి. ఏపీలో 25కు 25 సీట్లు గెలిపించాల్సింది మీరే
ప్రజాగళం సభలో చంద్రబాబు
-
2024-03-17T19:15:19+05:30
గన్నవరం విమానాశ్రయానికి మోదీ
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజాగళం సభ ముగించుకుని విమానాశ్రయానికి మోదీ
హైదరాబాద్‌కు బయల్దేరనున్న ప్రధాని
-
2024-03-17T19:00:34+05:30
పీవీకి భారత రత్న
పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించింది
కానీ ఎన్డీఏ ప్రభుత్వం పీవీ నరసింహారావును గౌరవించింది
పీవీకి భారత రత్న ఇచ్చాం
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ
-
2024-03-17T19:00:32+05:30
సీనియర్ ఎన్టీఆర్‌పై మోదీ ప్రశంసలు
సీనియర్ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి
రాముడి, కృష్ణుడు పాత్రలో జీవించేవారు
అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ట రోజు అదే గుర్తొచ్చింది
రైతులు, పేదల కోసం ఎన్టీఆర్ పోరాడారు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నాణెం విడుదల చేశాం
-
2024-03-17T19:00:13+05:30
కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
కాంగ్రెస్ మిత్రపక్షాలను వాడుకుని వదిలేస్తోంది
ఎన్డీఏలో మేము అందరిని కలుపుకుని వెళ్తున్నాం
ఇండియా కూటమిలో ఒకరంటే ఒకరికి పడదు
ఎన్నికలకు ముందే విబేధాలు బయటపడ్డాం
ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు
రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది
ప్రజాగళం సభలో మోదీ
-
2024-03-17T18:45:01+05:30
వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే: మోదీ
ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే
రెండూ కుటుంబ పార్టీలే
కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య స్నేహం ఉంది
వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు
తమపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చడానికి వైసీపీ.. కాంగ్రెస్ వాడుకుంటోంది
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ
-
2024-03-17T18:30:17+05:30
పోలీసుల దారుణ వైఫల్యం
ప్రజాగళం సభకు భద్రతను ఏర్పాటు చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం
సాక్షాత్తు దేశ ప్రధాని ప్రధాని ప్రోగ్రాంకి భద్రత కరువైందని టీడీపీ నేతల ఆవేదన
పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు
పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వ్యవహరించారు అంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నిబంధనలను పాటించిన పోలీసులు
మధ్యాహ్నం నుంచి సభకు జనాన్ని రానివకుండా ట్రాఫిక్ నెపంతో ఎక్కడికక్కడ ఆపేసిన పోలీసులు
-
2024-03-17T18:30:00+05:30
జగన్ ప్రభుత్వంపై మోదీ నిప్పులు
ప్రజాగళం సభలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారు
అవినీతి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు పెకిలించాలి
వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు
గత ఐదేళ్లలో ఏపీ కుంటుపడింది
ఢిల్లీలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తేవాలి
ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలి
ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం మొదటి సంకల్పం
ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడడం రెండో సంకల్పం
-
2024-03-17T18:15:54+05:30
ప్రధాని ప్రసంగానికి మూడు సార్లు ఆటంకం
ప్రజాగళం సభంలో ప్రధాని మోదీ ప్రసంగానికి మూడు సార్లు ఆటంకం
పోలీసులు కావాలనే జనాన్ని కంట్రోల్ చేయడం లేదన్న టీడీపీ నేతలు
ఐదేళ్లల్లో ఈ తరహా సభలు పెట్టుకునే అవకాశం వచ్చి ఉండవన్న ప్రధాని
ఈ ప్రభుత్వం మీద ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారని అర్థమవుతుందన్న ప్రధాని మోదీ
-
2024-03-17T18:15:24+05:30
పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం ఎన్డీఏ: మోదీ
కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సేవానిరతితో సేవను అందిస్తోంది
దేశంలో ఉన్న పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం ఎన్జీఏ ప్రభుత్వం
దేశ ప్రజల్లో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం
పీఎంఏవై కింద రాష్ట్రానికి 10 లక్షలు ఇళ్లు ఇస్తే దానిలో 5 వేల ఇళ్లు పల్నాడుకే ఇచ్చాం
జల్ జీవన్ మిషన్ కింద ఏపీలో ఎలాంటి డబ్బు తీసుకోకుండా కోటిమందికి నల్లా కనెక్షన్ ఇచ్చాం
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ
-
2024-03-17T18:15:17+05:30
బాబు, పవన్ ఏపీ కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు: మోదీ
కోటప్పకొండ నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్టు భావిస్తున్నా
నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే నేను ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాను
మూడవ సారి అధికారంలోకి వచ్చి దృఢమయిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది
ఈసారి జూన్ నాలుగో తారీఖున వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయి
అభివృద్ది చెందే దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు 400 సీట్లు అవసరం
ఎన్టీఏ పొత్తులో స్థానిక ప్రజల ఆకాంక్షలు, జాతీయ వృద్ధి రెండిటిని కలిసి తీసుకువెళతాం
ఎన్డీఏ బలం మరింత పెరుగుతుంది.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా కాలం నుంచి ఏపీ వికాశం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నారు.
ఎన్డీఏ లక్ష్యం వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం
భాగస్వాములు పెరగడం వల్ల ఎన్డీఏ బలం మరింత పెరుగుతోంది.
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ
-
2024-03-17T18:00:56+05:30
సభకు వచ్చిన వారికి మోదీ రిక్వెస్ట్
అక్కడ ఉన్నవారు ఒక్క అడుగు వెనక్కి వేస్తే మైక్ సిస్టం పనిచేస్తుంది
పోలీసులు పట్టించుకోవాలి
మీ ఉత్సాహం, మీ ఆనందం నాకు నాకు అర్థం అవుతోంది
చాలా దూరం నుంచి ఎంతో మంది శాంతంగా ఉండి చూస్తున్నారు
ముందున్న మీరు ఎందుకు ఆటకం కలిగిస్తున్నారు
ఒక్క అడుగు వెనెక్కి వేసి అక్కడ ఉండి సభను వినండి
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ
-
2024-03-17T18:00:17+05:30
తెలుగులో మోదీ సూపర్ స్పీచ్
తెలుగులో స్పీచ్ ప్రారంభించిన మోదీ
నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రారంభం
ఎన్డీఏ కూటమి ఒక లక్ష్యం
జూన్ 4న వెలువడే ఫలితాల్లో సీట్లు 400 దాటాలి
తెలుగులో పలికిన మోదీ
ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండూ అవసరం
రెండిటిని ఎన్డీఏ సమన్వయం చేస్తుంది
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ
-
2024-03-17T17:45:22+05:30
ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు
నరేంద్ర మోదీ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం ఆయన చెప్పడం వల్లే టవర్ నుంచి మీరు దిగారు
ప్రగతి వాది నరేంద్ర మోదీకి అయిదు కోట్ల ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం
ఈ ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నర్మాణ భరోసా సభ
అయిదేళ్లలో విద్వంస, అహంకార, అవినీతి పాలనలో ప్రజలు నాశనం అయ్యారు
మూడు పార్టీలు జెండాలు వేరుకావచ్చు మా అజెండా ఒక్కటే అదే సంక్షేమం, అదే అభివృద్ది, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ
మోదీ ఒక వ్యక్తి కాదు భారత దేశాన్ని విశ్వగురువుగా మార్చుతున్న ఓ శక్తి
మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ది, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వసం
ప్రధాన మంత్రి అన్న యోజన, అవాస్ యోజన, ఉజ్వల సన్మాన్ నిధి, జనజీవన్ మిషన్ వంటి వాటితో సంక్షేమానికి కొత్త అర్థం చెప్పారు మోదీ
డిజిటల్ ఇండియా, భారత్ మాలా వంటి అనేక అభివృద్ధి పథకాలు తెచ్చారు మోదీ
సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనేది ఆయన నినాదం
కోవిడ్ ఆపద సమయంలో వ్యాక్సిన్ తయారు చేయించి వంద దేశాలకు మోదీ సప్లై చేయించి ప్రాణాలు కాపాడారు
ప్రపంచ దేశాలకు ధీటుగా అమెరికా, చైనాతో పోటీ పడే ఆర్ధిక వ్యవస్థను తేగలరు మోదీ
వికసిత్ భారత్ రూపంలో దేశం ముందుకు వెళుతోంది
పేదరికం లేని దేశం మోదీ కళ
మన రాష్ట్రంలో పేదరికం లేని సమాజం మనం తీసుకువద్దాం
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-
2024-03-17T17:45:14+05:30
ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయి: చంద్రబాబు
ముందు చూపున్న నాయకుడు ప్రధాని మోదీ
ఏపీకి అండగా ఉంటామని చెప్పడానికే మోదీ వచ్చారు.
ప్రజాగళం సభ ఏపీ పునర్ నిర్మాణ భరోసా సభ
ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయి
మూడు పార్టీల జెండా వేరైనా.. మా అజెండా ఒక్కటే..
అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం
మోదీ భారత దేశాన్ని విశ్వ గురుగా మారుస్తున్నారు
మోదీ అంటే భవిష్యత్.. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం.
ఎన్నో పథకాలతో ప్రధాని మోదీ సంక్షేమం అందించారు.
మేకిన్ ఇండియా.. స్టార్టప్ ఇండియా.. స్కిల్ ఇండియా.. డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు.
నోట్ల రద్దు వంటి సంస్కరణలతో మోదీ భారత్ ముఖ చిత్రం మార్చారు.
సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారు.
ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు.
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-
2024-03-17T17:30:29+05:30
వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఘాటు విమర్శలు
వైఎస్ వివేకాను మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది
చంద్రబాబును అనేక ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఇది
ఈ ప్రభుత్వం పోవాలి
రావణాసురుడు అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉంది అని
అయితే నారచీర కట్టుకోని బాణంతో కొట్టి శ్రీ రాముడు చంపేసాడు
ఎన్నికల కురుక్షేత్రం కోసం మోదీ పాంచజన్యం పూరిస్తారు
ధర్మందే గెలుపు, పోత్తుదే విజయం, కూటమిదే పీఠం అని ప్రసంగం ముగించిన పవన్ కళ్యాణ్
అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు.
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు.
అయోధ్యకు రాముడిని తెచ్చిన మోదీ ఇక్కడున్నారు.. చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత
ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
2024-03-17T17:30:28+05:30
ఏపీ ఇబ్బందుల్లో ఉందని పవన్ ఆవేదన
ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోంది.
దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోంది.
ఇలాంటి సందర్భంలో ఏపీకి మోదీ రాక ఆనందాన్ని కలిగించింది.
ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.
2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.
2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుంది.
2014లో వెంకన్న ఆశీస్సులతో ఎన్డీఏ విజయం సాధించింది.
ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో అంతకు మించిన విజయం దక్కించుకుంటాం.
ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటుంటే..
జగన్ దాన్ని పక్కన పెట్టి అవినీతి చేస్తున్నారు.
మద్యం, ఇసుకలో అక్రమాలకు పాల్పడ్డారు
ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
2024-03-17T17:30:08+05:30
ఎన్డీఏదే అధికారం: చంద్రబాబు
ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది.
కూటమికి మోదీ అండ ఉంది.
ఏపీ ప్రజల తరఫున మోదీకి స్వాగతం
ఏపీ ప్రజల క్షేమం కోసం పరితపించే పవన్‌కు అభినందనలు
ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు మోదీ
మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం
ప్రజాగళం సభలో చంద్రబాబు
-
2024-03-17T17:15:48+05:30
సభా వేదికపైకి చేరుకున్న త్రిమూర్తులు
ప్రజాగళం సభా వేదికపైకి చేరుకున్న త్రిమూర్తులు
నినాదాలతో బొప్పూడి మారుమోగిన సభా ప్రాంగణం
కరతాళధ్వనులతో ప్రియతమ నేతలకు స్వాగతం పలికిన లక్షలాది ప్రజలు
ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టిన టిడిపి, జనసేన, బీజేపీ కార్యకర్తలు
మరికొద్దిసేపట్లో ప్రజాగళం సభలో ప్రసంగించనున్న కీలకనాయకులు
-
2024-03-17T17:15:08+05:30
హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి స్వాగతం: పవన్ కళ్యాణ్
హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి స్వాగతం పలుకుతున్నాను
కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు మోదీ రాక ఊరట
ఏపీకి ఉంటానంటూ మోదీ వచ్చారు
2014లో తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ ఘనవిజయం
2024లో దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుంది
ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్
-
2024-03-17T17:00:57+05:30
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ
బొప్పూడి సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
హెలీప్యాడ్‌లో మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి
హర్షధ్వానాలతో ప్రధాని మోదీని స్వాగతించిన లక్షలాది ప్రజలు
మరికాసేపట్లో వేదికపైకి చేరుకోనున్న త్రిమూర్తులు (మోదీ, చంద్రబాబు, పవన్)
-
2024-03-17T16:45:35+05:30
ట్రాఫిక్ మళ్లింపులో చేతులెత్తేసిన పోలీసులు
బొప్పూడి సభ వద్ద ట్రాఫిక్ మళ్లింపులో చేతులెత్తేసిన పోలీసులు
బొప్పూడి సభకు వచ్చే బస్సులను పార్కింగ్‌లోకి పంపకుండా రోడ్డు మీదే నిలిపివేయడంతో ట్రాఫిక్ జాం
సభవద్ద నుంచి జాతీయ రహదారిపై దాదాపు 12 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
బస్సులు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున బొప్పూడి సభ వద్దకు చేరుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మరికొంత మంది నేతలు
బొప్పూడి నుంచి చిలకలూరిపేట సమీపంలోని గణపవరం వరకూ నిలిచిపోయిన వాహనాలు
బొప్పూడి నుంచి ఒంగోలు వెళ్లే మార్గంలో కూడా కిలో మీటర్లమేర నిలిచిపోయిన సభకు వచ్చే వాహనాలు
కనీసం పార్కింగ్ ప్రదేశాలకు పంపకుండా చూస్తూ ఉండిపోయిన పోలీసులు
పార్టీ కార్యకర్తలే స్వయంగా రంగంలోకి దిగి వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు పంపించే ప్రయత్నం
సభ వెలుపలే నిలిచిపోయిన వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు
-
2024-03-17T16:30:23+05:30
ప్రధాని ట్వీట్‌పై స్పందించిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు స్వాగతం పలుకుతున్నారు
ఉమ్మడిగా మనం సరికొత్త మైలురాళ్లను చేరుకుందాం
కూటమి ఆధ్వర్యలో ఏపీ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో కూడిన సమర్థ పరిపాలనకు నాంది పలుకుదాం
-
2024-03-17T16:30:21+05:30
ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు
ప్రజాగళం సభకు ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు
కేవలం గంటవ్యవధిలో నిండిపోయిన 300 ఎకరాల సభా ప్రాంగణం
జన జాతరను తలపిస్తున్న బొప్పూడి సభా ప్రాంగణం
అభిమాన నేతల రాకతో నినాదాలతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు, ప్రజలు
అంచనాలకు మించి లక్షలాది ప్రజల రాకతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమినేతలు
-
2024-03-17T16:30:15+05:30
సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు
సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ
సాయంత్రం 4.50 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని
సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు ప్రధాని ప్రసంగం
-
2024-03-17T16:00:34+05:30
సభా ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బాలకృష్ణ
బొప్పూడి ప్రజాగళం నుంచి ప్రారంభం కానున్న టీడీపీ-జనసేన-బీజేపీ జైత్రయాత్ర
సభా ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ
ప్రధాని మోదీ మాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 కోట్లమంది ప్రజలు
జగన్మోహన్ రెడ్డి పాలనలో ధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణానికి మోదీ ఏ విధమైన భరోసా ఇస్తారోనని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు
ప్రజాగళం సభలో 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
చెరో 15 నిమిషాల చొప్పున ప్రసంగించనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రజాగళం వేదికపైకి మూడు పార్టీలకు చెందిన 30 మందికి అనుమతి
ఇప్పటికే సభాప్రాంగణానికి చేరుకున్న కూటమి సీనియర్ నేతలు
సభావేదిక వద్ద ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సాహంతో కార్యకర్తల కేరింతలు
-
2024-03-17T16:00:05+05:30
గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
స్వాగతం పలికిన ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజా బాబు, ఎస్పీ, బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు
కొద్దిసేపట్లో గన్నవరం నుంచి హెలీకాప్టర్‌లో బొప్పూడి సభకు వెళ్లనున్న మోదీ
-
2024-03-17T15:50:06+05:30
సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభం
సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ప్రజాగళం సభ
ఉత్సాహంతో కార్యకర్తల కేరింతలు
సభ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్
మరికాసేపట్లో సభ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు
-
2024-03-17T15:30:38+05:30
జాతీయ మీడియా ప్రత్యేక ఆసక్తి
పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వస్తుండటంతో జాతీయ మీడియా ప్రత్యేక ఆసక్తి
ఇప్పటికే ఢిల్లీ నుంచి బొప్పూడి చేరుకున్న జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు
అన్ని జాతీయా మీడియా సంస్థల్లో ప్రజాగళం సభ గురించే చర్చ
-
2024-03-17T15:30:12+05:30
అన్నిదారులు బొప్పూడి ప్రజాగళం వైపే...!
కొద్దిసేపటి క్రితం హెలీకాప్టర్‌లో బొప్పూడి ప్రజాగళం వేదిక వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు
సాయంత్రం 3.50 గంటలకు సభావేదిక వద్ద ల్యాండ్ కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
రాష్ట్రం నలుమూలల నుంచి బొప్పూడి ప్రజాగళం సభకు చేరుకుంటున్న టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు, ప్రజలు
సభకు వచ్చే ప్రజలకు మార్గమధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు కల్పించిన నిర్వాహకులు
విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి చీమలదండులా వేల సంఖ్యలో ప్రజాగళం సభకు చేరుకుంటున్న వాహనాలు
ఆర్టీసి పూర్తి స్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలు
బొప్పూడి ప్రజాగళం సభ చరిత్రలో నిలిచిపోతుందంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు
-
2024-03-17T15:15:51+05:30
సభా ప్రాంగణానికి చేరుకున్న పురంధేశ్వరి
బొప్పూడి ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి
సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ
గన్నవరం నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో 5 గంటలకు బొప్పూడి చేరుకోనున్న ప్రధాని
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొననున్న మోదీ
6.10 గంటలకు బొప్పూడి నుంచి తిరిగి గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి మోదీ
-
2024-03-17T15:15:37+05:30
గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భారీ భద్రత
ఎయిర్‌పోర్టు ముఖ దారం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మోదీ రాకతో గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు
చిలకలూరిపేట వెళ్లేందుకు ప్రధానమంత్రి కోసం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు
మోదీ కోసం గన్నవరం విమానాశ్రయ రన్‌వేపై నాలుగు హెలికాప్టర్‌లను సిద్ధం చేసిన అధికారులు
-
2024-03-17T15:00:37+05:30
ప్రజాగళం సభకు వచ్చే ముందు మోదీ ఆసక్తికర ట్వీట్
ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
నేను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మార్గంలో ఈ సాయంత్రం పల్నాడులో ఎన్‌డీఏ సభలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రసంగిస్తాను.
ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎన్‌డీఏ ఏపీ ఆశీస్సులను కోరుతోంది.
ట్వీట్‌లో పేర్కొన్న మోదీ
-
2024-03-17T14:45:20+05:30
ప్రజాగళం సభలో స్పెషల్ అట్రాక్షన్ ఇవే!
ప్రజా గళం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు
చేయి చాచినట్లుగా ఉన్న భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు
సభకు వచ్చిన వాళ్లంతా ఫ్లెక్సీల వైపే చూస్తున్న పరిస్థితి
అన్నగారికి దండాలు పెట్టి నమస్కారం చేస్తున్న కార్యకర్తలు!
ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు అంటూ నినాదాలు, ఈలలు, కేకలు!
-
2024-03-17T14:40:37+05:30
సభాస్థలికి చేరుకున్న సేనాని!
‘ప్రజా గళం’ సభాస్థలికి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
పవన్‌కు సాదర స్వాగతం పలికిన జనసేన, టీడీపీ ముఖ్య నేతలు
-
2024-03-17T14:10:20+05:30
సర్వం సిద్ధం.. మహా నాయకులు రావడమే ఆలస్యం
చిలకలూరిపేట ‘ప్రజా గళం’ సభకు సర్వం సిద్ధం
ఏపీలో మరికొద్దిసేపట్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం!
దాదాపు పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్
గత ఐదేళ్లలో అమరావతి విధ్వంసం, పోలవరం రివర్స్, ఆర్థిక పరిస్థితి దిగజారిన వైనం
ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని వైసీపీ సర్కార్
కేంద్రం సహకారం వల్లనే రాష్ర్టంలో వైసీపీ అరాచకం అని ప్రజల్లో బలంగా పేరుకుపోయిన భావం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పదేళ్ల తర్వాత పొత్తులతో వచ్చిన మూడు పార్టీలు
ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రులు
చిలకలూరిపేట సభ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు
వైసీపీ అరాచక పాలనపై ప్రధాని మోదీ స్పందన ఎలా ఉంటుందని చర్చ
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ప్రసంగం ఎలా ఉంటుందని ఉత్కంఠ
కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి బారులు తీరిన వాహనాలు
జాతీయ రహదారి అంతా సభ వాహనాలమయం
ఇప్పటికే ఆర్టీసీ నుంచి వెయ్యి బస్సులను అద్దెకు తీసుకున్న టీడీపీ
బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలొస్తున్న టీడీపీ, జన సేన, బీజేపీ కార్యకర్తలు, వీరాభిమానులు
-
2024-03-17T14:00:43+05:30
తరలొస్తున్నారు..!
ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ప్రజాగళం సభకి బయల్దేరిన వేలాది మంది జనం
జెండా ఊపి బస్సు ర్యాలీ ప్రారంభించిన మాజీమంత్రి నారాయణ
ప్రజలందరూ ఎలక్షన్ కోడ్ కోడ్ కోసం ఎదురు చూశారు
ఒక్క పిలుపుతో వేలాదిమంది తరలి వచ్చారు
ఒకప్పుడు బస్సులు పంపిస్తాం రండి అంటే ఎదురుచూడాల్సిన పరిస్థితి..
నేడు బస్సులు సరిపోని పరిస్థితి వచ్చింది
టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం బహిరంగ సభతో ప్రజలందరికీ కొత్త ఊపు వస్తుంది
నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు కూటమి గెలవబోతుంది : నారాయణ
-
2024-03-17T13:45:15+05:30
సభకు మాజీ సీఎం!
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విజయవాడ బయల్దేరిన కిరణ్ రెడ్డి
కిరణ్‌కు స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు
-
2024-03-17T13:30:38+05:30
అందరి చూపు సభ వైపే!
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ తొలి ఉమ్మడి సభ
దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి చూపు కూడా ఈ సభ వైపే
ఓకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
సుదీర్ఘకాలం తర్వాత ఒకే వేదిక పైకి వస్తున్న ముగ్గురు మొనగాళ్లు!
మోదీ, బాబు, పవన్ ఏం ప్రసంగిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి
రాష్ట్రంలో రహదారులన్నీ చిలకలూరిపేట వైపే!
ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా గళం సభకు తరలిస్తున్న ప్రజలు
మేదరమెట్ల.. గుంటూరు మధ్య గల చెన్నై.. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు
-
2024-03-17T13:20:19+05:30
ఎవరెప్పుడు వస్తారు..?
సరిగ్గా 3 గంటలకు ప్రారంభం కానున్న ‘ప్రజా గళం’
మధ్యాహ్నం 2 గంటలకు సభా ప్రాంగణానికి రానున్న చంద్రబాబు, పవన్
4 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు రానున్న ప్రధాని మోదీ
సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్న మోదీ
సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ప్రధాని ప్రసంగం
-
2024-03-17T13:15:25+05:30
ఏం మాట్లాడుతారో..?
అగ్ర నాయకులు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3,900 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. వేదిక మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధీనంలోకి వెళ్లింది. జాతీయ రహదారికి ఇరువైపులా విశాలమైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ మార్గాలు ఏర్పాటు చేశారు. ఆరు హెలిప్యాడ్లు సిద్ధం చేయగా వాటిలో మూడు ప్రధాని బృందానికి కేటాయించారు. ప్రాంగణంలో ఎక్కడ నిలబడ్డా వేదికపై ఏం జరుగుతోందో వీక్షించేలా పదుల సంఖ్యలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా.. ఎన్నికల వేళ జరుగుతున్న ‘ప్రజాగళం’ సభలో ప్రధాని మోదీ ఏం ప్రసంగిస్తారు..? ఏపీపై వరాల జల్లు కురిపిస్తారా..? లేకుంటే కీలక ప్రకటనలు చేస్తారా..? మరీ ముఖ్యంగా అధికార వైసీపీ, సీఎం వైఎస్ జగన్ రెడ్డి గురించి ఏం మాట్లాడుబోతున్నారనే దానిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. రాజధాని గురించి మోదీ నోట ఏం మాటలు వస్తాయ్..? అని రాజధాని రైతులు, ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
-
2024-03-17T13:00:45+05:30
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరి చూపు ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటలో జరగబోతున్న ‘ప్రజా గళం’ (Praja Galam) సభ వైపే..! ఎందుకంటే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు మొనగాళ్లు ఒకే వేదికపైకి వచ్చేస్తున్నారు.! ఇక సీన్ మామూలుగా ఉంటుందా చెప్పండి.. తగ్గేదేలా అన్నట్లుగా ఉండదూ.! పైగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తొలి సభ కావటం.. స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) విచ్చేస్తుండటంతో ఔరా అనిపించేలా పార్టీలు ఏర్పాట్లు చేశాయి. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూడు పార్టీలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి తొలి సభ ఇదే. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభ ఉంటుందని కూటమి వర్గాలు చెబుతున్నాయి. చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ‘ప్రజా గళం’ చారిత్రాత్మక సంచలన సభ జరగబోతోంది. ఈ సభకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వేదికైంది. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కాబోతోది. లక్షలాది సభకు వస్తారని పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. ప్రధానంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా లోక్‌సభ స్థానాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో తరలిరానున్నారు. ఇప్పటికే మంచి జోష్ మీదున్న క్యాడర్.. అధినేతలు ఇచ్చే సందేశంతో మరింత ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, కూటమి అఖండ విజయానికి కృషి చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. రష్ట్ర చరిత్రలో ఈ సభ ఒక మైలు రాయిగా నిలువనుంది.