Praja Galam: ‘ప్రజాగళం’ సభకు సర్వం సిద్ధం.. వేదికపై ఉండేది ఎవరెవరంటే..?
ABN , Publish Date - Mar 17 , 2024 | 08:18 AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణ బద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట. ప్రజాగళం పేరిట నిర్వహించనున్న ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారు. చిలకలూరిపేట (Chilakaluripet) సమీపంలోని బొప్పూడిలో జరిగే సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ఈ సభ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.
భారీ భద్రత
కూటమి తరపున మొదటి సభ కావడంతో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మోదీ, బాబు, పవన్ ఒకే వేదికపైకి రానుండటంతో అసాధారణ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభా ప్రాంగణంలో 20 పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లు పెట్టారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. సభా ప్రాంగణం సమీపంలో ఆరు హెలీ ప్యాడ్‌లను సిద్ధం చేశారు. సభా వేదిక చుట్టూ ఇనుపగ్రిల్స్‌తో బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
వేదికపై 30 మంది
60 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు ఉండేలా సభా వేదిక నిర్మాణం చేపట్టారు. వేదికపై మూడు పార్టీకలు చెందిన 30 మందిని మాత్రమే అనుమతించనున్నారు. వేదికపై ఎవరు ఎవరుండాలనే దానిపై ఇప్పటికే లిస్ట్ రెడీ చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్‌తో పాటు మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు కొందరు వేదిక పంచుకోనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
ప్రజాగళం సభా ప్రాంగణం టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. సభా ప్రాంగణం చుట్టుపక్కల పండగ వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి రానున్న పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది జనం రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ మీదగా విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు-దిగమర్రు జాతీయ రహదారి 214-ఏ పైకి మళ్లించి ఒంగోలు, త్రోవగుంట, చీరాల, పెనుమూడి, రేపల్లె, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం హైవేకి కలపనున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి