Home » Prakasam Barrage
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి వైసీపీ హయాంలో తీరని నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో బ్యారేజీ నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద రోజురోజుకు కోత పెరుగుతోంది.
Andhrapradesh: బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద బోల్తా పడిన బోట్లలో రెండో దానిని ఇంజినీరింగ్ అధికారులు గురువారం సాయంత్రం ఒడ్డుకు చేర్చారు. మొదటి బోటు మాదిరిగానే దీన్నీ పున్నమి ఘాట్ సమీపానికి చేర్చారు. మొదటి దాన్ని ఒడ్డుకు చేర్చడానికి 11రోజుల సమయం పట్టగా, రెండో బోటును కేవలం రెండ్రోజుల్లోనే తీసుకొచ్చారు.
Andhrapradesh: బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలు 80 టన్నుల బరువు ఉండటంతో అనేకసార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు కావడి మంత్రం వ్యూహంతో నిన్న (మంగళవారం) నీళ్ల అడుగున ఉన్న బోటును అధికారులు బయటకు తీశారు. భారీ బోటును నిన్న అర్ధరాత్రి గేట్ల వద్ద నుంచి దుర్గా ఘాట్ వరకు సిబ్బంది లాక్కెళ్లారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపునకు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు.
నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరుబు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా..
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్స్‌ను కట్ చెయ్యాలి అధికారులు నిర్ణయించారు. మొత్తం నాలుగు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.