Share News

Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే

ABN , Publish Date - Sep 25 , 2024 | 02:15 PM

Andhrapradesh: బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.

Chandrababu: బోట్ల ఘటన..  కచ్చితంగా వైసీపీ కుట్రే
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 25: ప్రకాశం బ్యారేజీని (Prakasham Barrage) ఢీకొన్న బోట్ల ఘటనలో ఖచ్చితంగా వైసీపీ (YSRCP) కుట్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యలు చేశారు. బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని మండిపడ్డారు. విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు నష్టపరిహారాన్ని సీఎం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో రథం కాల్చేశారన్నారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ‘‘నేను అసమర్థుణ్ని కాను.. ఎవరు ఏం తప్పు చేసినా తెలిసేలా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరైనా కుట్రలు పన్నితే ఖబడ్దార్’’ అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Devara-KTR: ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించిన కేటీఆర్.. ఎందుకంటే?


నేను బట్ నొక్కి ఫూల్స్‌ని చేయను: చంద్రబాబు

వరద నష్ట పరిహారం కోసం 13 వేల మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. కొత్తగా అప్లై చేసుకున్న వారిలో అర్హులకు సాయం అందిస్తామన్నారు. అనర్హులు ఉంటే ఎందుకివ్వలేకపోయామో చెబుతామన్నారు. ‘‘నేనిక్కడ బటన్ నొక్కడం లేదు.. బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. నేరుగా బాధితుల ఖాతాలకే సాయం అందిస్తున్నాం. కుమ్మరిపాలెంలోని 38 వార్డులోకి నీరే రాలేదు.. ఇళ్లు మునగలేదు. కొందరు రెచ్చగొట్టి గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. వరద సాయంలో ఎవరైనా కరెప్షన్‌కు పాల్పడితే సహించను. ఎవరైనా డబ్బులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్


చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో...

ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ మించిన స్థాయిలో ఆర్థిక సాయం అందించామన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా బాధితులకు సాయం అందిస్తున్నామని వెల్లడించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక సాయం అనేది కేంద్రం నిబంధనల్లో లేదని.. కానీ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చామన్నారు. పంట నష్టాన్ని కూడా భారీగా పెంచామని.. సేవల్లో టెక్నాలజీని వివియోగించుకున్నామని తెలిపారు. నారాయణ, నిమ్మల, అనిత ఫీల్డులో బాగా పని చేశారని కొనియాడారు. సీనియర్ ఆఫీసర్ సిసోడియా కూడా బాగా పని చేశారన్నారు. సేవల విషయంలో ఎవ్వరూ ఊహించని విధంగా చేశామన్నారు. గృహోపకరణాలు రిపేర్లు చేయించామని.. వాహనాలకు బీమా ఇప్పించామన్నారు.


త్వరలోనే ఆపరేషన్ బుడమేరు

‘‘గ్యాస్ స్టౌలు కూడా బాగు చేయించాం. చిన్న వ్యాపారస్తులకు సాయం అందించాం. లోన్లు రీ-షెడ్యూల్ చేయించాం. కొత్త లోన్లు ఇప్పించాం. సర్టిఫికెట్లని ఉచితంగా ఇప్పిస్తున్నాం. విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ ఇప్పిస్తున్నాం’’ అని సీఎం వెల్లడించారు. లైసెన్సుల్లేని కిరాణా షాపులకు కూడా సాయం అందించామన్నారు. భూ యజమానుకు కాకుండా వ్యవసాయం చేసే కౌలు రైతులకే బాధితులకు పరిహరం ఇచ్చామన్నారు. అలాగే ఇంటి యజమానులు నష్టపోయి ఉంటే.. వారికి.. లేకుంటే అద్దెకున్న వాళ్లకి సాయం అందించామన్నారు. త్వరలో ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇంకా కేంద్రం సమావేశాలు పెట్టుకుని.. ఏపీకి చేయాల్సిన వరద సాయంపై చెబుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Lokesh: ఐటీ పాలసీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 02:18 PM